శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 29 నవంబరు 2018 (13:41 IST)

నోట్ల రద్దు అతి క్రూరమైన చర్య : అరవింద్ సుబ్రమణ్యన్

దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేయడం అతి క్రూరమైన చర్యగా ప్రధానమంత్రి ఆర్థిక మాజీ సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న తొందరపాటు నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు.
 
తాను రాసిన ఓ పుస్తకంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో నోట్ల రద్దు అనేది అతిపెద్ద, క్రూర‌మైన, ఆర్థిక‌ప‌ర‌మైన షాక్ అని అర‌వింద్ ఆరోపించారు. నోట్ల ర‌ద్దు వ‌ల్లే ఆర్థిక ప్ర‌గ‌తి 6.8 శాతానికి ప‌డిపోయింద‌ని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
దేశంలో పెద్ద విలువ కలిగిన నోట్లను రద్దు చేయడం వల్ల చాలా రంగాలు ఘోరంగా దెబ్బతిన్నాయనీ, ఇవి ఇప్పటికీ కోలుకోలేక ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, ముఖ్య ఆర్థిక స‌ల‌హాదారు ప‌ద‌వికి గ‌త జూన్‌లో రాజీనామా చేసిన అర‌వింద్‌.. కేవ‌లం అవినీతిని త‌గ్గించేందుకే ప్ర‌ధాని మోడీ నోట్ల ర‌ద్దును చేప‌ట్టిన‌ట్లు చెప్పారు. పెద్ద నోట్ల రద్దుకు ముందు అభివృద్ధి 8 శాతం ఉండేద‌ని, కానీ ఆ త‌ర్వాత అది 6.8 శాతానికి ప‌డిపోయింద‌న్నారు.
 
కాగా, గత 2016, నవంబ‌ర్ 8వ తేదీన ప్ర‌ధాని నరేంద్ర మోడీ.. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన విషయం తెల్సిందే. అయితే ఆ అంశంపై తాను రాసిన ఓ పుస్త‌కంలో వెల్ల‌డించారు. ఆఫ్ కౌన్సిల్‌- ద ఛాలెంజెస్ ఆఫ్ ద మోడీ-జైట్లీ ఎకాన‌మీ పేరుతో పుస్త‌కాన్ని ప్ర‌చురించ‌నున్నారు.