శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 12 నవంబరు 2018 (11:49 IST)

నోట్లో ముద్ద పెట్టుకుంటూ ప్రాణాలు విడిచిన తెరాస నేత...

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఓ అపశృతి చోటుచేసుకుంది. తెరాస నేత ఒకరు భోజనం చేస్తూచేస్తూ తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఆదివారం జీడిమెట్ల డివిజన్‌లో తెరాస నేతలు ఎన్నికల ప్రచారం చేపట్టారు. కార్యకర్తలకు రుక్మిణి ఎస్టేట్‌లో భోజన ఏర్పాట్లు చేశారు. వెన్నెలగడ్డకు చెందిన రమేశ్‌(57) నాయకులతోపాటు బస్తీలో తిరుగుతూ ప్రచారం నిర్వహించాడు. 
 
ఆ తర్వాత కార్యకర్తలతో కలిసి భోజనం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన కార్యకర్తలు అతడిని సమీపంలోగల ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి చనిపోయినట్టు నిర్ధారించారు. మృతుడికి ముగ్గురు కుమారులు. గుండెపోటుతో మరణించారని తెరాస నేతలు అంటున్నారు.