శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 16 నవంబరు 2018 (09:30 IST)

హెయిర్ డై కలిపిన డికాషన్ తాగిన మహిళ....

హైదరాబాద్ నగరంలో ఓ మహిళ పొరపాటున హెయిర్ డై కలిపిన డికాషన్ తాగడంతో ప్రాణాలు కోల్పోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, చప్పల్ బజార్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి భార్య సంధ్య (24). గృహిణిగా ఇంట్లోనే ఉంటూ పిల్లల ఆలనాపాలనా చూస్తోంది. 
 
ఈ క్రమంలో బుధవారం రాత్రి టీ పెట్టుకునేందుకు స్టౌపై డికాషన్ పెట్టింది. వంటగది సమీపంలోనే హెయిర్ డై డబ్బు పెట్టింది. అది తెలియని ఆమె మూడేళ్ళ కుమారుడు.. ఆ హెయిర్ డైను స్టౌపై కాగుతున్న డికాషన్‌లో పోశాడు. 
 
ఈ విషయం తెలియని సంధ్య... ఆ డికాషన్‌ను తాగింది. తాగిన కొద్దిసేపటికి ఆమె అపస్మారక స్థితిలోకి జారుకుంది. దీంతో ఆమెను హుటాహుటిని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ గురువారం కన్నుమూసింది. కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.