బుధవారం, 14 జనవరి 2026
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By
Last Modified: బుధవారం, 14 నవంబరు 2018 (11:50 IST)

ఓ స్త్రీ మగవాడి నుంచి ఏం ఆశిస్తుంది?

చాలామంది పురుషులు "మహిళలను అర్థం చేసుకోవడం చాలా కష్టం" అని అంటుంటారు. అయితే ఓ స్త్రీ, మగవాడి నుంచి ఏం ఆశిస్తుందనే విషయంలో కాస్త శ్రద్ధ పెడితే అమ్మాయిలను అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు అటున్నారు. మహిళలు ముఖ్యంగా పురుషుడు నిజాయతీపరుడై ఉండాలని భావిస్తారట. ఇక ధైర్యం సంగతి సరేసరి. 
 
అయితే, ఒక్కసారి అబద్ధం చెప్పి బుక్కయిపోతే, కొంపమునిగినట్టేనని నిపుణులు అంటున్నారు. అబద్ధాలు చెపితే అంత తేలిగ్గా క్షమించరట. తప్పు ఒప్పుకుంటే మాత్రం ఆమె మనసు కరిగించేందుకు కొన్ని అవకాశాలను సృష్టించుకున్నట్టే అవుతుంది. ఆమె చెప్పేది అత్యంత శ్రద్ధగా వినాల్సి ఉంటుంది. స్త్రీతో సుదీర్ఘ బంధం నెరపాలంటే ఇలా చేయకతప్పదు మరి. తను చెప్పేది వినాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. స్త్రీ భావోద్వేగపరమైన అనుబంధం ఏర్పరచుకునేందుకు అనువుగా మసలుకోవాలి. 
 
అన్నింటికన్నా ప్రధానమైనది ఏమంటే... స్త్రీలు, పురుషుల కంటే త్వరగా పరణతి సాధించినా, పురుషుడే తమకంటే గొప్పగా ఉండాలని కోరుకుంటారు. తమ పురుషుడు గొప్పలు కొట్టేవాడు కాకుండా, తగిన నియంత్రణతో, కార్యదక్షత ఉన్న వ్యక్తి అయి ఉండాలని ఆశిస్తారు. ఒకవేళ సమస్యల నుంచి పారిపోయే వ్యక్తి అయితే, స్త్రీ మనసులో స్థానం కోల్పోయినట్టే. కనుక స్త్రీ మనస్సును గెలుచుకోవాలంటే పైన చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకోకతప్పదని నిపుణులు అంటున్నారు.