ఆర్ఆర్ఆర్‌లో ఆ హీరోయిన్ నటించనుందా..?
దర్శకధీరుడు రాజమౌళి లేటెస్ట్ సెన్సేషన్ ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో రూపొందే ఈ భారీ మల్టీస్టారర్ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 11న సినీ ప్రముఖుల సమక్షంలో ప్రారంభమైన ఈ సంచలన చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను ఈ నెల 19 నుంచి స్టార్ట్ చేసేందుకు పక్కా ప్లాన్ రెడీ చేసారు. ఈ షెడ్యూల్ కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ కూడా రెడీ చేసారు. ఎన్టీఆర్, చరణ్‌ల పైన భారీ యాక్షన్ సీన్‌ని షూట్ చేయనున్నారని సమాచారం.
ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు. అందులో ఒక హీరోయిన్ విదేశీ హీరోయిన్ అని తెలిసింది. మిగిలిన ఇద్దరు ఇక్కడ వారే కానీ... ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. అయితే... ఛలో సినిమాతో తొలి ప్రయత్నంలోనే సక్సస్ సాధించి.. గీత గోవిందం సినిమాతో బ్లాక్ బష్టర్ సొంతం చేసుకుని దేవదాస్ సినిమాతో కూడా ఆకట్టుకున్న రష్మికకి ఈ సినిమాలో ఛాన్స్ వచ్చిందంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే... రష్మికకు బంపర్ ఆఫరే..!