సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 11 నవంబరు 2018 (10:42 IST)

'RRR' అంటే అర్థం ఇదే...

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించనున్న చిత్రం "ఆర్.ఆర్.ఆర్". దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా సంచలనం సృష్టించిన చిత్రం "బాహుబలి". ఈ చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్. 
 
కొన్ని నెలల విరామం తర్వాత రాజమౌళి.. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం ఆదివారం లాంఛనంగా ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమానికి హీరో ప్ర‌భాస్ ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ చిత్రం చిత్ర వివ‌రాలు, టైటిల్‌తో పాటు మిగ‌తా విష‌యాలు కూడా ఆదివారమే వెల్లడించనున్నారు. 
 
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ గత కొన్ని రోజులుగా ఆర్.ఆర్.ఆర్ అంటూ ప్రచారం సాగుతూ వస్తోంది. అయితే ఈ ఆర్.ఆర్.ఆర్‌లోనే చిత్రం టైటిల్ ఉందని, అది "రామ రావణ రాజ్యం" అని సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. 
 
మ‌రి దీనిపై చిత్ర బృందం ఆదివారం ఏదైన క్లారిటీ ఇస్తుందా అనేది చూడాలి. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 
 
వ‌చ్చే నెల‌లో ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళేలా రాజమౌళి స‌న్నాహాలు చేసుకుంటున్నార‌ని స‌మాచారం. చిత్రంలో ఓ క‌థానాయిక‌గా కీర్తి సురేష్ పేరు వినిపిస్తుండ‌గా, మ‌రో హీరోయిన్ స‌మంత అని ప్రచారం సాగుతోంది.