వినయ విధేయ రామ టీజర్... బోయపాటీ... ఇక మారవా అంటూ...
ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి తాజా చిత్రం వినయ విధేయ రామ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజ్ చేసారు. టైటిల్ క్లాస్‌గా ఉన్నా లుక్ మాత్రం మాస్‌గా ఉంది. ఇక టీజర్‌ను కూడా రిలీజ్ చేసారు. మాస్ ఆడియన్స్ నుంచి విశేషాదరణ లభిస్తోంది. ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ అనేలా ఉంది ఈ టీజర్. సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. పండగ సీజన్లో వస్తున్న కరెక్ట్ సినిమా.
ఇదిలా ఉంటే... బోయపాటిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఎందుచేత అంటే... బోయపాటి ఏ సినిమా తీసుకున్నా... భారీ ఫైట్‌లు.. ఫ్యామిలీ ఎమోషన్స్ కామన్‌గా కనిపిస్తున్నాయి. కానీ... కొత్తదనం మాత్రం కనిపించడం లేదు. చరణ్ సినిమాలో అయినా కొత్తగా ఉంటుంది అనుకుంటే టీజర్ చూస్తుంటే.. ఇవే ఫైట్లు కనిపిస్తున్నాయి. దీంతో బోయపాటి ఇక మారవా అంటూ కొంతమంది నెటిజన్లు సెటైర్స్ వేస్తున్నారు. మరి... బోయపాటి ఇక నుంచైనా మారి వైవిధ్యమైన చిత్రాలు అందిస్తాడేమో చూడాలి.