సంబంధిత వార్తలు
- 2019లో తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి మళ్లీ కేసీఆర్... సర్వే ఫలితాలు...
- హిజ్రాతో సహజీవనం చేశాడు.. డబ్బు ఇవ్వలేదని గొంతు కోశాడు.. ఎక్కడ..?
- నిజామాబాద్‌లో దారుణ హత్య... వివాహితను బ్యాగులో కుక్కి.. వాగులో?
- జర్నలిస్ట్‌కు అండగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు... రూ. 16 లక్షల విరాళం...
- చంద్రబాబూ ఎన్నాళ్లీ కుట్రలు.. హరీష్ రావు 18 ప్రశ్నలు..?
మరలా కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పనున్న డి.శ్రీనివాస్
డి.శ్రీనివాస్ మళ్లీ కాంగ్రెస్‌లో చక్రం తిప్పబోతున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా సోనియాతో డి.ఎస్ భేటీ కావడంతో మహాకూటమిలో పార్టీల మధ్య సమన్వయ బాధ్యతను సోనియా డి.ఎస్‌కు అప్పచెప్పారు.
ఇప్పుడున్న కాంగ్రెస్ నేతలు మహాకూటమి విషయంలో సరిగ్గా వ్యవహరించడం లేదనే భావనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. ఈ కారణంగానే డీఎస్‌కు కాంగ్రెస్ పార్టీ ఈ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రపదేశ్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా వై.ఎస్ హవా నడుస్తున్నా, డి.ఎస్ కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద తనకంటూ ఓ ప్రత్యేక కోటరీని ఏర్పాటు చేసుకున్నారు.
ఈ పరిచాయలతోనే డీఎస్ అనుభవాలను వాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరి డి.ఎస్ వ్యూహాలు ఏమేరకు పార్టీకి లాభిస్తాయో వేచిచూడాలి.
