జర్నలిస్ట్‌కు అండగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు... రూ. 16 లక్షల విరాళం...

Muralimohan
శ్రీ| Last Modified గురువారం, 8 నవంబరు 2018 (20:44 IST)
నిత్యం వార్తలు మోసే జర్నలిస్టుల కుటుంబాలలో ఏదైనా ప్రమాదం జరిగితే మేమున్నాం అంటూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భరోసా ఇచ్చారు. 20 సంవత్సరాలుగా ఈటివిలో జర్నలిస్టుగా పనిచేస్తున్న సత్యన్నారాయణ కొన్ని నెలల క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌తో హాస్పటల్‌లో జాయిన్ అయ్యారు. ఖరీదైన వైద్యం అందించేందుకు ఆ కుటుంబం ఆర్థికంగా బలమైనది కాదు. ఆ కష్టం తెలిసిన జర్నలిస్టుల చొరవతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సియమ్ రిలీఫ్ ఫండ్ నుండి 9 లక్షలు అందించగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సియమ్ రిలీఫ్ ఫండ్ నుండి 7 లక్షలు అందించారు.
 
ఇంకా సినిమా ప్రముఖులు, మేనేజర్స్, తోటి జర్నలిస్టుల సహాకారంతో సత్యన్నారాయణకు పెద్ద ఊరట కలిగింది. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు, టిడిపి నేత మురళీమోహన్ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఆనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్ట్ సత్యన్నారాయణకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఏడు లక్షల చెక్‌ను అందించారు.

ఈ పత్రికా సమావేశంలో నటుడు బెనర్జీ మాట్లాడుతూ... ‘‘జర్నలిస్టులను మేము ఎప్పుడూ వేరుగా చూడలేదు. మా ఎదుగుదలలో వారు ఎప్పుడూ ఉంటారు. వారికి ఏదైనా కష్టం వస్తే మేము స్పందించడానికి వెనకడుగు వేయం. సత్యన్నారాయణ గారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను’’ అన్నారు.
 
మా అధ్యక్షుడు శివాజీ మాట్లాడుతూ: ‘‘జర్నలిస్టులు ఎప్పుడూ మా ఎదుగదలలో భాగంగానే చూస్తాము. ‘మా’ అసోసియేషన్ ఎప్పుడూ ఇలాంటి పనులకు ముందుంటుంది. మూవీ ఆర్టిస్టులే కాదు మాముందుకు కష్టం ఉందని ఎవరు వచ్చినా మాకు చేతనైన సహాయం చేస్తాం ’’ అన్నారు. 
 
నటి అనితా చౌదరి మాట్లాడూతూ: ‘‘ మేము ఎప్పుడు జర్నలిస్ట్ లను కలిసినా కుటుంబ సభ్యులను కలిసినట్లే అనిపిస్తుంది. మా ఇంట్లో పండుగలు పెద్దగా జరుపుకోము. ఏదైనా పుట్టిన రోజు వేడుకలు చేసుకోవాలంటే అనాథ శరణాలయంకు కానీ, ఓల్టేజ్ హోమ్‌కి కానీ వెళ్లి అక్కడ వారితో జరుపుకుంటాం. సత్యన్నారాయణ గారికి ఇలా జరిగింది అని తెలియగానే మా కుటుంబంలో ఒకరికి జరిగనట్లు అనిపించింది.‘ మా’ తరపున కూడా వారికి సహాయం అందించాం ’’ అన్నారు.
 
నటుడు, పార్లమెంట్ మెంబర్ మురళీమోహన్ మాట్లాడుతూ: ‘‘సినిమా పరిశ్రమలో ఎవరికైనా సహాయం అందించడానికి  ఎప్పుడూ ‘మా’ ముందుంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం కూడా సినిమా పరిశ్రమకు సహాయం అందించడానికి ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. సినిమా జర్నిలస్టులను చూసి నేను గర్వంగా ఫీల్ అవుతాను. వారి మాకు శ్రేయాభిలాషులు, స్నేహితులల్లా మాతో మెలుగుతారు. సత్యనారాయణ గారి ఆరోగ్యం గురించి నాకు తెలిసినప్పుడు నేను పర్సనల్‌గా చంద్రబాబు గారితో మాట్లాడాను. నేను ఏడు లక్షలు ఇస్తే బాగుంటుంది అంటే వెంటనే చెక్ రాసి ఇచ్చారు. తెలుగు ఇండస్ట్రీలో ఎవరికి ఏ సహాయం కావాల్సి వచ్చినా ఆయన ఎప్పుడూ ముందుంటారు. జర్నలిస్టులందరూ వచ్చి అమరావతిలో ఇళ్ళు కట్టుకోదలిస్తే... ఆ విషయంలో తప్పకుండా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. 
 
జర్నలిస్టులను కుటుంబ సభ్యులుగా బావిస్తాము. తెలంగాణా ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి సత్యనారాయణ కుటుంబానికి 9 లక్షలు అందించినందుకు సంతోషంగా ఉంది.’’ అన్నారు. జర్నలిస్ట్ సత్యనారాయణ మాట్లాడుతూ: ‘‘ నేను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు నాకు అండగా నిలిచిన రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులకు, నాతోటి జర్నలిస్టులకు, నటీనటులకు, పీఆర్వోలకు, అందరికీ ధన్యవాదాలు. నేను కోలుకుంటానని అనుకోలేదు, మీ అందరి ఆశీస్పులే నన్ను కాపాడాయి’’ అన్నారు. 
 
సత్యనారాయణకు అండగా నిలిచిన వారిలో మంచు లక్ష్మి( నటి), క్రిష్ జాగర్లమూడి( దర్శకుడు), దిల్ రాజు( నిర్మాత), హారి( మేనేజర్), మహేంద్ర(మేనేజర్), మారుతి (దర్శకుడు), వల్లి (కీరవాణి గారి భార్య), పీపుల్స్ మీడియా ప్రసాద్ గారు, వంశీ శేఖర్( పిఆర్వో), ఠాగూర్ మధు(నిర్మాత), నాగశౌర్య( హీరో), జివి( జర్నలిస్ట్), మహేష్ కోనేరు(నిర్మాత), జిఎ2 బన్నీవాసు( నిర్మాత), బెల్లంకొండ శ్రీను( హీరో), సి. కళ్యాణ్(నిర్మాత), మైత్రి మూవీస్, మాక్స్ మీడియా సాయి, సుమ రాజీవ్ కనకాల’’ ఉన్నారు.దీనిపై మరింత చదవండి :