తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తిన చిరంజీవి... కాంగ్రెస్‌తో కటీఫేనా?

Chiranjeevi
Last Modified గురువారం, 8 నవంబరు 2018 (19:32 IST)
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ. డిసెంబరు నెలలో జరుగనున్నాయి. ఈ నేపధ్యంలో అటు మహాకూటమి, ఇటు తెరాస నువ్వానేనా అంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాయి. ఇదిలావుంటే... తాజాగా మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన పొగడ్తల జల్లు కురిపించడంతో కాంగ్రెస్ కంగుతిన్నంత పనైంది.
 
ఇంతకీ మెగాస్టార్ చిరు ఏమన్నారంటే... హైదరాబాదులోని సినీ పరిశ్రమ అన్ని హంగులతో, పరిపూర్ణంగా ఉందంటే దీని వెనుక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఎంతో ఉందని అన్నారు. అంతటితో ఊరుకోకుండా దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎంపీకయ్యారంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పిన విషయం నిజమేనంటూ కితాబిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల ముఖ్యమంత్రి కాదనీ, ఆయన చేతల ముఖ్యమంత్రి అంటూ కొనియాడారు. 
 
సినీ ఇండస్ట్రీ కోసం తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తోందనీ, ఇంకా తమకు తట్టనివి ఏమయినా వుంటే తనకు చెప్పాలని సీఎం కేసీఆర్ తనతో చెప్పినట్లు చిరంజీవి వెల్లడించారు. ఆయనకు సినీ ఇండస్ట్రీపై వున్న మక్కువ ఎంతటిదో దీన్నిబట్టి ఇట్టే అర్థమవుతుందన్నారు. సంతోషం అవార్డు ఫంక్షనులో చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు.దీనిపై మరింత చదవండి :