శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By
Last Updated : మంగళవారం, 16 అక్టోబరు 2018 (17:30 IST)

జనసేనలోకి చిరంజీవి.. తమ్ముడి కోసం.. (Video)

మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి కానరానంత దూరంలో వున్నారు. కొన్నేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా వున్న చిరంజీవి.. ఆ పార్టీకి రాం రాం చెప్పేయాలని భావిస్తున్నారట.

మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి కానరానంత దూరంలో వున్నారు. కొన్నేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా వున్న చిరంజీవి.. ఆ పార్టీకి రాం రాం చెప్పేయాలని భావిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 2007వ సంవత్సరం చిరంజీవి రాజకీయాల్లో రానున్నారని జోరుగా ప్రచారం సాగింది. ఈ చర్చకు తెరదించుతూ 2008 ఆగస్టు 17 తన రాజకీయ ప్రవేశ విషయాన్ని ప్రకటించారు.. చిరంజీవి. 
 
ఆ తర్వాత 2008 ఆగస్టు 26న మదర్ థెరిసా జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుపతి ఆవిలాల చెరువు మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేసి తన పార్టీ పేరును, పతాకాన్ని ఆవిష్కరించారు. కానీ 2011, ఫిబ్రవరి 6 వతేదీన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. దీంతో అప్పటి నుంచి కాంగ్రెస్ నేతగా ప్రజల్లోకి వెళ్లిన చిరంజీవి ఆ పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 
 
రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగానూ పని చేసిన ఆయన, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత, కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన సంగతి తెలిసిందే. తన 150వ చిత్రంగా ''ఖైదీ నెం.150''తో వచ్చిన ఆయన, ప్రస్తుతం 'సైరా' షూటింగ్‌లో వున్నారు. ఈ సినిమా తర్వాత రాజకీయాలకు వచ్చే అవకాశం లేదని.. అందుకే కాంగ్రెస్ పార్టీని వద్దనుకుంటున్నట్లు టాక్. అంతేగాకుండా వరుస సినిమాలతో దూసుకెళ్లాలని చిరంజీవి భావిస్తున్నారు.
 
మరోవైపు చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగిసినా, ఆయనింకా దాన్ని పునరుద్ధరించుకోలేదు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో రంగంలోకి దిగాలని రాహుల్ గాంధీ, స్వయంగా కోరినా, చిరంజీవి స్పందించలేదని తెలుస్తోంది. ఈ వ్యవహారం చూస్తుంటే.. చిరంజీవి కాంగ్రెస్‌కు బైబై చెప్పేయాలనుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 
 
అంతేగాకుండా తమ్ముడు పార్టీలో ఉన్నత పదవిని అలంకరించడం కోసమే కాంగ్రెస్ పార్టీకి బై చెప్పాలనుకుంటున్నట్లు సమాచారం. జనసేనలో గౌరవ అధ్యక్ష పదవి లేదా అధ్యక్ష పదవిలో చిరంజీవిని కూర్చోబెట్టాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారని.. అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చేయమన్నారని నెట్టింట చర్చ సాగుతోంది. జనసేనతో కలిసి పనిచేయాలని తమ్ముడు కోరడంతో అన్నయ్య కూడా అందుకు అంగీకరించారని సమాచారం.