"సైరా" టీజర్ ఔట్.. గురూజీ ఆగమనం (వీడియో)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అత్యంత కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బిగ్ బి గురువారం తన 76వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. దీంతో సైరాలో ఆయన పోషించే కీలక పాత్రకు సంబంధించిన లుక్‌తో టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అమితాబ్ గోసాయి వెంకన్న పాత్రలో కన్పించబోతున్నారు. ఇందులో ఆయన నరసింహారెడ్డికి గురువుగా నటించారు.
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గురువు పాత్రలో అమితాబ్ ఒదిగిపోయారు. ఆయన లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో యుద్ధ సన్నివేశాలను హాలీవుడ్ నిపుణుల ఆధ్వర్యంలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందన్న టాక్ ఇప్పటికే వుంది. ఇందుకోసం ఏకంగా రూ.45 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, అదిరిపోయే గ్రాఫిక్స్‌తో ఈ యుద్ధ సన్నివేశం ఒళ్లు గగురుపొడిచేలా ఉంటాయని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. ఈచిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ షూటింగ్ ముగిసిన తర్వాత మరోసారి హైదరాబాద్‌లో షెడ్యూల్ ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. కాగా, ఈ చిత్రంలో అమితాబ్, నయనతార, విజయ్‌సేతుపతి, జగపతిబాబు, సుదీప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగుతో పాటు, హిందీ, తమిళ్ తదితర భాషల్లో సినిమా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.