సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (11:42 IST)

'సైరా నరసింహా రెడ్డి'లో 'గోన గన్నారెడ్డి' ... అంతకుమించిన పాత్రలో...

మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో అనేక మంది సినీనటులు నటిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో అనేక మంది సినీనటులు నటిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. అలాగే, కోలీవుడ్, శాండిల్‌వుడ్ నుంచి పేరున్న నటులు ఈ సినిమాలో చేస్తున్నారు.
 
ఇదిలావుంటే, ఇప్పుడు ఓ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అదేమంటే 'సైరా' సినిమాలో అల్లు అర్జున్ ఓ ప్రముఖ పాత్రను చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 'రుద్రమదేవి' సినిమాలో గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ ఆకట్టుకున్నాడు. ఈ పాత్రకు మంచి పేరు కూడా వచ్చింది. 
 
అల్లు అర్జున్ డైలాగులు అలరించాయి. 'గోన గన్నారెడ్డి' కంటే పవర్ఫుల్ పాత్రను సైరాలో చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అల్లు అర్జున్ చేయబోతున్న ఆ పవర్ఫుల్ పాత్ర ఏంటి అనే విషయం మాత్రం బయటకురావడం లేదు. మెగా కుటుంబం నుంచి ఈ సినిమాలో నిహారిక కొణిదెల కూడా ఓ చిన్న రోల్‌ను ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే.