సంబంధిత వార్తలు
- జనసేన పార్టీ తొలి అభ్యర్థి పేరు వెల్లడి.. పవన్ కాదు.. ఇంకెవరు?
- తోట కాపరి కుమార్తెపై కన్నేశాడు.. ఎవ్వరూ లేని సమయంలో?
- 'రానా'నా? 'నారా'నా?... ఎన్టీఆర్ బయోపిక్ ఎక్కడ స్టార్టై ఎక్కడ ఎండ్ అవుతుంది?
- నందమూరి హరికృష్ణ పెద్దకర్మ పూర్తి... విగ్రహం ఎక్కడ?
- బాలయ్య ఆ విషయం చెప్పగానే కన్నీళ్ళు పెట్టుకున్నారట కళ్యాణ్ రామ్...
ఆ పాత్ర నేను చేయలేనంటున్న నాగబాబు.. వెంటపడుతున్న క్రిష్..?
టాలీవుడ్‌లో ఇప్పుడు బయోపిక్‌ల టైం నడుస్తోంది. మొన్న మహానటి సినిమా రికార్డులు తిరగరాసింది. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్‌ను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించిన ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో చర్చ జరుగుతోంది. ఎస్వీ రంగారావు పా
టాలీవుడ్‌లో ఇప్పుడు బయోపిక్‌ల టైం నడుస్తోంది. మొన్న మహానటి సినిమా రికార్డులు తిరగరాసింది. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్‌ను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించిన ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో చర్చ జరుగుతోంది. ఎస్వీ రంగారావు పాత్ర కోసం మెగా ఫ్యామిలీకి చెందిన నాగబాబు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు ఏ మాత్రం హైప్ తగ్గకుండా డైరెక్టర్ క్రిష్ బాగానే మేనేజ్ చేస్తున్నారు. ఒక్కసారిగా పాత్రలను నిర్ధేశించుకోకుండా ఒక్కొక్కటిగా ప్రకటిస్తూ అంచనాలను పెంచేస్తున్నారు. తెలుగు సినిమాల్లో ఎస్వీ రంగారావు విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రెస్. నేచురల్ యాక్టింగ్‌కు మీనింగ్ ఆయన. అందుకే టాలీవుడ్ బయోపిక్‌లలో ఆయన పాత్ర ఉండేటట్లుగా చూసుకుంటున్నారు. అయినా ఎస్వీ రంరావును చూపించడం ఒక ఛాలెంజ్‌గా మారుతోంది. మహానటి మూవీలో ఎస్వీఆర్ పాత్రను అద్భుతంగా చూపించారు.
మహానటి సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అద్భుతంగా నటించారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్‌లో మెగాబ్రదర్ నాగబాబు అయితే కరెక్టుగా సరిపోతారని దర్శకుడు క్రిష్ నిర్ణయానికి వచ్చి నాగబాబును కూడా సంప్రదించారట. అయితే ఆ పాత్ర నేను చేయలేనని నాగబాబు క్రిష్‌కు తేల్చి చెప్పేశారట. ఎస్వీరంగారావు లాంటి పాత్ర నేను చేయాలంటే కష్టంతో కూడుకున్న పని అని తేల్చేశాడట నాగబాబు. అయితే ఎలాగోలా ఆయనను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట దర్శకుడు క్రిష్.
