శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (11:18 IST)

తోట కాపరి కుమార్తెపై కన్నేశాడు.. ఎవ్వరూ లేని సమయంలో?

తోట కాపరి కుమార్తెపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలోని నూజివీడు మండల పరిధిలో చోటుచేసుకుంది. తోటలో తండ్రి లేని సమయాన్ని అదనుగా తీసుకున్న ఆ వ్యక్తి యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

తోట కాపరి కుమార్తెపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలోని నూజివీడు మండల పరిధిలో చోటుచేసుకుంది. తోటలో తండ్రి లేని సమయాన్ని అదనుగా తీసుకున్న ఆ వ్యక్తి యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళితే.. నూజివీడు మండలంలోని ఓ తోటకు ఓ కుటుంబం కాపలా ఉంటుంది. కాపలాగా ఉంటున్న వ్యక్తికి ముగ్గురు కూతుళ్లు. ఇద్దరు కూతుళ్లకు ఆయన పెళ్లిళ్లు చేశాడు. 
 
రెండో కూతురితో కలిసి తోటలో నివాసం ఉంటున్నాడు. సెప్టెంబర్ 9వ తేదీన బాధితురాలి తండ్రి పనిమీద నూజివీడుకు వెళ్లాడు. కానీ ఈ తోటకు పక్కనే మరో తోటను లీజుకు తీసుకున్న శ్రీనివాసరావు.. పక్కనున్న తోటలోని యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
చివరికి నూజివీడు నుండి ఇంటికి వచ్చిన బాధితురాలి తండ్రి కూతురిని చూసి చలించిపోయాడు. ఇంకా ఈ ఘటనపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసుల కేసు నమోదు చేసుకుని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు.