శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 10 సెప్టెంబరు 2018 (14:24 IST)

చెన్నై సెంట్రల్ స్టేషన్ పేరును.. రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషనుగా..

మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితకు భారతరత్న అవార్డు ఇవ్వాలని తమిళనాడు కేబినెట్ కేంద్రాన్ని కోరింది. అలానే సెంట్రల్ రైల్వే స్టేషన్ పేరును ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషనుగా పేరు మార్చాలని విజ్ఞప్తి చేసింది. ఆదివారం నాడు జరిగిన కేబినెట్ సమావేశంలో

మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితకు భారతరత్న అవార్డు ఇవ్వాలని తమిళనాడు కేబినెట్ కేంద్రాన్ని కోరింది. అలానే సెంట్రల్ రైల్వే స్టేషన్ పేరును ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషనుగా పేరు మార్చాలని విజ్ఞప్తి చేసింది. ఆదివారం నాడు జరిగిన కేబినెట్ సమావేశంలో జరిగిన నిర్ణయాలను మంత్రి డి. జయకుమార్ తెలియజేశారు.
   
 
అంతేకాకుండా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకులు ఏడుగురిని విడిపించాలని కూడా తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఈ మేరకు తీర్మానాలు చేసినట్లు మంత్రి తెలిపారు. మరి ఇక ఏం జరుగుతుందో చూద్దాం.