శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 8 సెప్టెంబరు 2018 (09:23 IST)

బాలీవుడ్ నటి సొనాలీ బింద్రే చనిపోయిందా?

బాలీవుడ్ నటి సొనాలీ బింద్రే చనిపోయిందంటూ బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు చేసిన ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ట్వీట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక ప్రజా ప్రతినిధిగా ఉంటూ అసత్య వార్తలు ప

బాలీవుడ్ నటి సొనాలీ బింద్రే చనిపోయిందంటూ బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు చేసిన ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ట్వీట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక ప్రజా ప్రతినిధిగా ఉంటూ అసత్య వార్తలు ప్రసారం చేస్తారా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఎమ్మెల్యే పేరు రామ్ కదమ్. ఇప్పటికే ఈయన గారు ఓ వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా మరో వివాదానికి తెరలేపారు.
 
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అమ్మాయిలను కిడ్నాప్ చేయాలని యువకులకు పిలుపునిచ్చి వార్తల్లోకి ఎక్కారు. ఇపుడు కేన్సర్‌తో బాధపడుతూ అమెరికాలో చికిత్స పొందుతున్న బాలీవుడ్ నటి సోనాలి బింద్రే కన్నుమూసిందని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ ట్వీట్ చేశారు. తద్వారా నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. 
 
తనకు వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్‌ను స్క్రీన్ షాట్ తీసిన ఆయన దానిని యధాతథంగా ట్విట్టర్‌లో షేర్ చేశారు. అది చూసిన నెటిజన్లు ఆయనను ట్రోల్ చేస్తూ ఆటాడుకున్నారు. ఎమ్మెల్యేకు వచ్చిన వాట్సాప్‌ మెసేజ్‌లో.. 'హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమను ఏలిన నటి సోనాలి బింద్రే ఇక లేరు. మనందరికీ ప్రియమైన ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం' అని ఉంది. 
 
దీన్ని చూసిన నెటిజన్లు ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడడంతో ఎమ్మెల్యే స్పందించారు. ట్వీట్‌ను డిలీట్ చేసి క్షమాపణలు కోరుతూ మరో ట్వీట్ చేశారు. 'సోనాలి గురించి వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఆమె త్వరగా కోలుకోవాలని, తిరిగి పూర్తి ఆరోగ్యవంతురాలు కావాలని భగవంతుడిని వేడుకుంటున్నా' అని పేర్కొన్నారు.