మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (10:11 IST)

బీజేపీ ఎమ్మెల్యే నాలుక కోసి తెస్తే రివార్డు.. కాంగ్రెస్ నేత ప్రకటన

భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే నాలుక కోసి తెచ్చిన వారికి లక్షలాది రూపాయలను రివార్డుగా ఇవ్వనున్నట్టు కాంగ్రెస్ నేత ప్రకటించారు. మహారాష్ట్రలోని ఘాట్‌కోప‌ర్ వెస్ట్ ఎమ్మెల్యేగా బీజేపీకి చెందిన రా

భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే నాలుక కోసి తెచ్చిన వారికి లక్షలాది రూపాయలను రివార్డుగా ఇవ్వనున్నట్టు కాంగ్రెస్ నేత ప్రకటించారు. మహారాష్ట్రలోని ఘాట్‌కోప‌ర్ వెస్ట్ ఎమ్మెల్యేగా బీజేపీకి చెందిన రామ్ కదమ్ ఉన్నారు. ఈయన తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
 
ముఖ్యంగా, అమ్మాయిలను అపహరించాల్సిందే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. అయితే.. ఈ వ్యాఖ్యలపై మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ లీడర్ సుబోధ్ సావ్జీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రామ్ కదమ్ నాలుకను కోసి తీసుకొచ్చే వాళ్లకు రూ.5 లక్షల రివార్డు ప్రకటించాడు.