శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By srinivas
Last Modified: గురువారం, 6 సెప్టెంబరు 2018 (17:49 IST)

“కెసీర్ హటావో... తెలంగాణ బచావ్” ఇదే మా నినాదం... కాంగ్రెస్

శాసనసభను రద్దు చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జ్ కుంతియా మండిపడ్డారు. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉందని తెలియజేశారు. ఎన్నికల్లో పొత్తులకు మేము సిద్ధమని, 9 నెలలకు పైగా వ్యవధి ఉండగానే అసెంబ్లీ ఎందుకు రద్

శాసనసభను రద్దు చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జ్ కుంతియా మండిపడ్డారు. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా కాంగ్రెస్ పార్టీ  ఎన్నికలకు సిద్ధంగా ఉందని తెలియజేశారు. ఎన్నికల్లో పొత్తులకు మేము సిద్ధమని, 9 నెలలకు పైగా వ్యవధి ఉండగానే అసెంబ్లీ ఎందుకు రద్దు చేశారని, రాష్ట్రంలో ఏమైనా ప్రకృతి విపత్తు వచ్చిందా? శాంతిభద్రతలు క్షీణించాయా...? అని ప్రశ్నించారు. 
 
కెసీర్‌ది సరైన చర్య కాదనీ, ఎవరి కోసం ఆయన సభను రద్దు చేశారని ప్రశ్నించారు. ప్రజలు 5 ఏళ్లు పరిపాలించమని అధికారం ఇచ్చారు. కానీ ముందుగానే శాసనసభను రద్దు చేశారు. దీని మూలంగా ఆరు నెలలు తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరుగదు. దీనివల్ల బంగారు తెలంగాణ వస్తుందా అని నిలదీశారు? హామీలు నిలబెట్టుకోవడంలో కెసీర్ పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించారు.
 
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనీ, కెసీర్ యుగం ముగిసిందని అన్నారు. “కెసీర్ హటావో... తెలంగాణ బచావ్”... ఇదే నినాదంతో ఎన్నికలకు వెళతామనీ, ఖచ్చితంగా విజంయ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.