దటీజ్ కేసీఆర్... తెలంగాణ అసెంబ్లీ రద్దుకు కేబినెట్ తీర్మానం...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి చెబితే వందసార్లు కాదు... ఒక్కసారే చెప్పినట్లు లెక్క. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తామని గతంలో చెప్పింది చేసి చూపించారు. గురువారం నాడు హైదరాబాద్ ప్రగతిభవన్‌లో జరిగిన టీ-కేబినెట్ భేటీలో ఈ మేరకు తీర్మానం చేశారు. తెలం

ivr| Last Modified గురువారం, 6 సెప్టెంబరు 2018 (13:43 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి చెబితే వందసార్లు కాదు... ఒక్కసారే చెప్పినట్లు లెక్క. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తామని గతంలో చెప్పింది చేసి చూపించారు. గురువారం నాడు హైదరాబాద్ ప్రగతిభవన్‌లో జరిగిన టీ-కేబినెట్ భేటీలో ఈ మేరకు తీర్మానం చేశారు. తెలంగాణ అసెంబ్లీ రద్దు చేస్తూ మంత్రి వర్గం ఏక వాక్య తీర్మానం చేసింది.
 
కాగా ఈ తీర్మానాన్ని తీసుకుని సీఎం కేసీఆర్, మంత్రులు రాజ్ భవన్‌కు వెళ్లనున్నారు. అక్కడ గవర్నర్‌కు తమ తీర్మానాన్ని అందజేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ రద్దు తీర్మానం విషయంపై గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు కేసీఆర్ సర్కార్ తెర దించింది. ముందస్తు ఎన్నికలకు సై అంటూ కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తూ తీర్మానం చేశారు. మరి దీనిపై అటు కాంగ్రెస్ ఇటు భాజపా ఎలా స్పందిస్తాయో చూడాలి.దీనిపై మరింత చదవండి :