గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 20 జులై 2018 (22:30 IST)

ప్యాకేజీకి బాబు ఒప్పుకున్నారు... ఇప్పుడు వైసీపి ఉచ్చులో చిక్కుకున్నారు... నరేంద్ర మోదీ

అవిశ్వాస తీర్మానంపై నరేంద్ర మోదీ తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానాన్ని తూర్పారపట్టారు. ప్యాకేజీకి ఓకే చెప్పి ఆ తర్వాత రాజకీయ ప్రయోజనాల కోసం యూ-టర్న్ తీసుకున్నారంటూ విమర్శించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... " తల్లిని చంపి బిడ్డను బయటకు తీసింది కాంగ్రె

అవిశ్వాస తీర్మానంపై నరేంద్ర మోదీ తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానాన్ని తూర్పారపట్టారు. ప్యాకేజీకి ఓకే చెప్పి ఆ తర్వాత రాజకీయ ప్రయోజనాల కోసం యూ-టర్న్ తీసుకున్నారంటూ విమర్శించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... " తల్లిని చంపి బిడ్డను బయటకు తీసింది కాంగ్రెస్ పార్టీ... ఇంతకుముందు చెప్పా.. ఇప్పుడు కూడా అదే చెపుతున్నాను. పంపకాల వివాదం సాగుతోంది. ప్రత్యేక హోదాను ప్రత్యేక ప్యాకేజీగా మార్చాము.ఏపీ, తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి వున్నాం.
 
ప్యాకేజీ మంచిదని తెదేపా నాయకుడు ఒకరు చెప్పారు. ఇప్పుడు యూ టర్న్ ఎందుకు తీసుకున్నారు? కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ పని చేశారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు చేశాం. ఎన్డీఏ నుంచి తెదేపా తప్పుకున్నప్పుడు మీరు వైసీపిలో చిక్కుకున్నారని బాబుకు ఫోన్ చేసి చెప్పాను. ఎన్డీఏ ఆంధ్రప్రజల కళ్యాణానికి కట్టుబడి వుంది. 
 
అసలు వివాదం ఏపీలో వుంటే సభలో పోరాడుతున్నారు. ఓటుకు నోటు సంగతి మర్చిపోతారు. నన్ను ప్రధానిగా కూర్చోబెట్టేది 125 కోట్ల మంది ప్రజలు, విపక్ష పార్టీలు కాదు. ఒక్క మోదీని దించేందుకు ప్రయాస పడుతున్నారు. మేం అధికార పక్షంలో వున్నాం. ఈ అవిశ్వాన్ని అందరూ తిరస్కరించాలి అంటూ చెప్పారు.