సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By Selvi
Last Updated : శుక్రవారం, 20 జులై 2018 (18:28 IST)

ప్రియా ప్రకాశ్ వారియర్‌లా రాహుల్.. కన్నుగీటిన వీడియో మీ కోసం..

లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కన్నుగీటారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ కన్నుకొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు.. రాహుల్ ప్రధాని నరేంద్ర మోదీని ఆలింగనం చేసుకోవడం, షే

లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కన్నుగీటారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ కన్నుకొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు.. రాహుల్ ప్రధాని నరేంద్ర మోదీని ఆలింగనం చేసుకోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడంపై సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి.
 
ఇక రాహుల్ గాంధీ లోక్‌సభలో కన్నుకొట్టడంపై నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరైతే మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్‌తో రాహుల్‌ను పోల్చుతున్నారు. మలయాళ సినిమాలోని ఓ పాటకు కన్నుకొడుతూ ప్రియా ప్రకాష్ వారియర్ యువతను అమితంగా ఆకట్టుకున్న ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ ఒక్క సీన్‌తో ఆమె రాత్రికి రాత్రే ఇంటర్నెట్ వైరల్‌గా మారిపోయింది. దీంతో పాంటు మంచి స్టార్ డమ్ కూడా వచ్చినట్టైంది.
 
కాగా ప్రస్తుతం రాహుల్ చర్యను కూడా ప్రియా ప్రకాష్‌తో పోల్చుతూ కొందరు నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ను మరిపించావ్‌ రాహుల్ అంటూ కొందరు.. ప్రియను ఫాలో అవుతున్నావా రాహుల్ జీ అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం రాహుల్ కన్నుగీటిన వీడియోను ఓ లుక్కేయండి.