శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 6 సెప్టెంబరు 2018 (17:05 IST)

కుమార స్వామి సతీమణి చేతిలో నాలుగు సినిమాలు

కర్ణాటక సీఎం కుమారస్వామి సతీమణి, ప్రముఖ నటి రాధికా కుమార స్వామి మళ్లీ సినిమాల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు సినిమాలు వున్నాయని తెలుస్తోంది. కాంట్రాక్ట్, రాజేంద్ర పొన్నప్ప, భైరదేవి, న

కర్ణాటక సీఎం కుమారస్వామి సతీమణి, ప్రముఖ నటి రాధికా కుమార స్వామి మళ్లీ సినిమాల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు సినిమాలు వున్నాయని తెలుస్తోంది. కాంట్రాక్ట్, రాజేంద్ర పొన్నప్ప, భైరదేవి, నిమగగి అనే పేరున్న సినిమాల్లో రాధికా కుమార స్వామి నటించనుందని సమాచారం. భైరదేవి చిత్రంలో రమేష్ అరవింద్ నటిస్తుండగా, కాంట్రాక్ట్‌లో అర్జున్ నటిస్తున్నాడు. 
 
కాగా.. రాధికా కుమారస్వామి 2002లో నీలమేఘ శ్యామతో కన్నడ సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. తొమ్మిదో తరగతి చదవగానే ఈ ఫీల్డులోకి వచ్చింది. 31 ఏళ్ల రాధిక 30కి పైగా సినిమాలలో నటించారు. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. 
 
రాధికా కుమారస్వామి చివరి చిత్రం ఈశ్వర్. 2015 తరువాత దాదాపు మూడు సంవత్సరాలు పాటు సినిమాలకు దూరంగా ఉంది. అయితే మళ్ళీ ఆమె సినిమాలో నటిచాలనుకుంటుంది. రీ ఎంట్రీలోనూ ఆమెకు మంచి ఫాలోయింగ్ వుంటుందని సినీ విశ్లేషకులు జోస్యం చెప్తున్నారు.