సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 3 సెప్టెంబరు 2018 (11:26 IST)

జుట్టు రాలుతుందని నదిలో దూకేసిన యువతి.. ఎక్కడ?

చిన్నపాటి సమస్యలకే ఆత్మహత్యలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా జుట్టు రాలిపోతుందని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, మైసూరుకు చెందిన

చిన్నపాటి సమస్యలకే ఆత్మహత్యలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా జుట్టు రాలిపోతుందని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, మైసూరుకు చెందిన ఓ యువతి జుట్టు రాలుతున్నాయని మనస్తాపానికి గురైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
కర్ణాటక, మైసూరులోని ఓ ప్రైవేట్ కాలేజీల నేహా (19) అనే యువతి హాస్టల్‌లో బస చేస్తూ.. బీబీఏ చదువుతోంది. కొడగు జిల్లాకు చెందిన ఈ యువతి కొద్ది రోజుల క్రితం బ్యూటీ పార్లర్‌కు వెళ్లి స్ట్రయిట్నింగ్ కోసం వెళ్లింది. అక్కడ వారు జుట్టు రాలకుండా వుండేందుకు ఏదో క్రీమ్ రాసినట్లు తెలుస్తోంది. దీంతో నేహా జుట్టు అతిగా రాలిపోతూ వచ్చాయి. 
 
ఆపై జుట్టు రాలుతూ వుండటానికి ఎలాంటి వైద్యం చేయించినా ఫలితం లేకపోవడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో మనస్తాపానికి గురైన నేహా.. మైసూరులోని లక్ష్మణ తీర్థ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.