శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 23 ఆగస్టు 2018 (14:34 IST)

శునకాలకు వేసినట్లు జనంపైకి బిస్కెట్లు వేస్తారా? మంత్రిగారూ ఏంటిది?

మాజీ ప్రధాన మంత్రి దేవగౌడ కుమారుడు.. కర్ణాటక మంత్రి హెచ్డీ రేవణ్న వరద బాధితుల పట్ల వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. వరద బాధితులను హేళన చేసేలా వ్యవహరించిన ఆయన తీరుపై కర్ణాటకలో ప్రజలు మండిపడుతున్

మాజీ ప్రధాన మంత్రి దేవగౌడ కుమారుడు.. కర్ణాటక మంత్రి హెచ్డీ రేవణ్న వరద బాధితుల పట్ల వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. వరద బాధితులను హేళన చేసేలా వ్యవహరించిన ఆయన తీరుపై కర్ణాటకలో ప్రజలు మండిపడుతున్నారు. వరద బాధితులపైకి బిస్కెట్‌ పాకెట్లను మంత్రి విసిరేయడం.. జనం కూడా ఆ బిస్కెట్ల కోసం ఆరాటపడటం చూసిన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 
 
జనంపైకి బిస్కెట్లు విసరటమే మంత్రి సంస్కారమా అంటూ ప్రశ్నిస్తున్నారు. మంత్రిగారి మానవత్వం ఇదేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై వెంటనే ప్రజలకు మంత్రి హెచ్‌డీ రేవణ్న క్షమాపణ చెప్పాలని కర్నాటక ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 
 
కాగా భారీవర్షాల కారణంగా కొడుగు జిల్లాతో పాటు పొరుగున ఉన్న హసన్‌, చిక్కమగళూరు జిల్లాలు సైతం అతలాకుతలమయ్యాయి. అక్కడికి వెళ్లి మంత్రి వారికి ధైర్యం చెప్పి చేరదీయాల్సిందిపోయి… వారిని శునకాలకు బిస్కెట్లు వేసినట్లు వ్యవహరించారు.