జయలలిత బయోపిక్.. సీన్లోకి వచ్చిన దేవసేన
దివంగత సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బయోపిక్ కోసం రంగం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా రెండు సినిమాలు తెరకెక్కనున్నాయని తెలుస్తోంది. ఇందులో భాగంగా జయలలిత పాత్రలో ఎవరు
దివంగత సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బయోపిక్ కోసం రంగం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా రెండు సినిమాలు తెరకెక్కనున్నాయని తెలుస్తోంది. ఇందులో భాగంగా జయలలిత పాత్రలో ఎవరు కనిపించబోతున్నారనే విషయంపై ప్రస్తుతం చర్చ సాగుతోంది.
అమ్మ పాత్రలో త్రిష, నయనతార, కీర్తి సురేష్‌ల మధ్య పోటీ వుంటుందని కోలీవుడ్‌లో జోరుగా చర్చ సాగింది. అయితే జయలలిత పాత్రలో... అరుంధతి, దేవసేన, భాగమతి అంటే అనసూయ కనిపిస్తుందని టాక్ వస్తోంది.
వెండితెరపై అందాల కథానాయికగా, తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేసిన శక్తిమంతమైన నాయకురాలిగా జయలలిత ప్రజల మనసులను కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. అన్నివర్గాల ప్రజలచేత అమ్మ అని పిలుచుకున్న జయలలిత బయోపిక్‌ను రూపొందించేందుకు ఎ.ఎల్. విజయన్, ప్రియదర్శన్, భారతీరాజా ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు వున్నారు.
భారతీరాజా చకచకా తన ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలను మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. జయలలిత బయోపిక్ కోసం భారతీ రాజా ఐశ్వర్యరాయ్‌ని, అనుష్కను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఐశ్వర్యరాయ్ ఓకే అంటే లక్కేనని, కానీ ఆమె కుదరంటే మాత్రం అనుష్కను తీసుకోవాలని భారతీ రాజా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను డిసెంబరులో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. పురట్చితలైవి, అమ్మ అనే పేర్లు ఈ సినిమాకు పరిశీలనలో వున్నాయి.