ఆ విషయంలో జయ, కరుణ.. ఇద్దరూ కలిసిపోయారు..

తమిళనాడు రాజకీయాల్లో బద్ధ శత్రువులైన డీఎంకే, అన్నాడీఎంకే అధ్యక్షులు ప్రస్తుతం కనుమరుగైపోయారు. తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. వారెవరో కాదు.. డీఎంకే చీఫ్ కరుణ, అన్నాడీఎంకే మాజీ అధ్యక్షురాలు జయలలిత. వీ

selvi| Last Updated: గురువారం, 9 ఆగస్టు 2018 (15:25 IST)
తమిళనాడు రాజకీయాల్లో బద్ధ శత్రువులైన డీఎంకే, అన్నాడీఎంకే అధ్యక్షులు ప్రస్తుతం కనుమరుగైపోయారు. తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. వారెవరో కాదు.. డీఎంకే చీఫ్ కరుణ, అన్నాడీఎంకే మాజీ అధ్యక్షురాలు జయలలిత. వీరిద్దరూ నువ్వా నేనా అంటూ రాజకీయాల్లో పోటీపడ్డారు. ఒకరిపై ఒకరు రాణించేందుకు సంసిద్ధమయ్యేవారు. కానీ చివరికి ఈ ఇద్దరూ ఒక విషయంలో మాత్రం కలిసిపోయారు. కానీ ఇది యాదృచ్చికంగా జరిగిపోయింది. 
 
అదేంటంటే.. తమిళనాడుకు దశాబ్దాల పాటు సేవలందించిన జయలలిత, కరుణానిధిలు పాల్గొన్న చివరి కార్యక్రమాలు ఒకే నెలలో జరిగాయి. 2016లో రాష్ట్రానికి సీఎంగా ఉన్న సెప్టెంబర్ 21న చెన్నైలో జరిగిన మెట్రో రైలు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. లిటిల్ మౌంట్ నుంచి విమానాశ్రయం వరకూ రైలు సేవలను జెండా ఊపి ప్రారంభించారు. ఆపై ఆమె బయట మరెక్కడా కనిపించలేదు. చివరికి డిసెంబర్ 5వ తేదీ 2016లో ఆమె అపోలోలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇక డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి కూడా బయట చివరిసారిగా కనిపించింది అదే సంవత్సరం అదే నెల కావడం గమనార్హం. 2016 సెప్టెంబర్ 17న చెన్నైలోని అన్నా అరివాలయంలో ''డీఎంకే ముప్పెరుం విళా'' జరుగగా, కరుణానిధి పాల్గొని తన సహజత్వానికి భిన్నంగా భావోద్వేగంతో ప్రసంగించారు. తాను పాల్గొనే చివరి వేడుక ఇదేనని చెప్పారు. ఆ మరుసటిరోజు అక్కడే జరిగిన పార్టీ జిల్లాల కార్యదర్శులతో సమావేశమైన ఆయన, ఆపై ఇంటికే పరిమితం అయ్యారు. వీరిద్దరూ 2016 సెప్టెంబర్ తరువాత బయటి ప్రపంచంలోకి రాలేదు.దీనిపై మరింత చదవండి :