శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 8 ఆగస్టు 2018 (12:55 IST)

తమిళ సినిమాలకే కాదు.. తెలుగు చిత్రాలకు కూడా స్క్రీన్ ప్లే...

డీఎంకే అధినేత కరుణానిధి రాజకీయాల్లోకి రాకముందు అనేక తమిళ చిత్రాలకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే రచించారు. అలాంటి చిత్రాలు ఎన్నో విజయవంతమయ్యాయి. ముఖ్యంగా, నడిగర్ తిలకం శివాజీ గణేశన్‌ను ఓ హీరోగా నిలబెట్టింద

డీఎంకే అధినేత కరుణానిధి రాజకీయాల్లోకి రాకముందు అనేక తమిళ చిత్రాలకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే రచించారు. అలాంటి చిత్రాలు ఎన్నో విజయవంతమయ్యాయి. ముఖ్యంగా, నడిగర్ తిలకం శివాజీ గణేశన్‌ను ఓ హీరోగా నిలబెట్టింది కూడా కరుణానిధి మాటలు, స్క్రీన్ ప్లేనే. రాజకీయాల్లో ఎంతో బిజిగా ఉన్నప్పటికీ... ఆయన సినీ పరిశ్రమతో ఉన్న అనుబంధాన్ని మాత్రం తెంచుకోలేదు. ఏదైనా సినిమా ఫంక్షన్‌కు పిలిస్తే, తప్పకుండా హాజరయ్యేవారు.
 
అంతేకాకుండా, తెలుగు చిత్ర పరిశ్రమతో కూడా ఆయన అనుబంధం ఉంది. రామానాయుడు నిర్మించిన 'ప్రేమనగర్' సినిమా శతదినోత్సవ వేడుకకు కరుణ హాజరై... నటీనటులు, సాంకేతిక నిపుణులకు జ్ఞాపికలు అందించారు. దాసరి దర్శకత్వం వహించిన 'నీడ' చిత్ర శతదినోత్సవానికి కూడా కరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
 
ఓ తెలుగు సినిమాకు ఆయన స్క్రీన్ ప్లే అందించడం విశేషం. సూపర్ స్టార్ కృష్ణ నటించిన 'అమ్మాయి మొగుడు-మామకు యముడు' సినిమాకు ఆయన స్క్రీన్ ప్లే రాశారు. తమిళంలో జయశంకర్, జయచిత్ర జంటగా నటించిన 'వండిక్కారణ్ మగన్' చిత్రానికి తెలుగు అనువాదమే ఈ సినిమా. తమిళ సినిమాకు మాటలు రాసిన కరుణానిధి, తెలుగు చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. కరుణ మేనల్లుడు మురసోలి సెల్వం ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.