శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By selvi
Last Updated : శుక్రవారం, 17 ఆగస్టు 2018 (14:41 IST)

అటల్ జీ.. నెహ్రూని వెనక్కి తిరిగి చూడొద్దన్నారు.. ఎందుకు..?

భారత తొలి ప్రధాన మంత్రిగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ బాధ్యతలు స్వీకరించిన కాలంలో 1951-52 కాలంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో శ్యామా ప్రసాద్ ముఖర్జీ నాయకత్వంలోని జన్ సంఘ్ పార్టీ (తర్వాత బీజేపీగా మారింది) మూ

భారత తొలి ప్రధాన మంత్రిగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ బాధ్యతలు స్వీకరించిన కాలంలో 1951-52 కాలంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో శ్యామా ప్రసాద్ ముఖర్జీ నాయకత్వంలోని జన్ సంఘ్ పార్టీ (తర్వాత బీజేపీగా మారింది) మూడు సీట్లు గెలుచుకుంది.


దేశ విభజన గాయాలు అప్పటికీ మానకపోవడంతో మతతత్వ వాఖ్యలు చేసే నేతలపై నెహ్రూ గుర్రుగా వున్నారు. హిందుత్వ సిద్ధాంతాలు పాటించే జన్ సంఘ్ నేతలపై కూడా నెహ్రూ కోపంగా ఉండేవారు. ఆ సమయంలో అప్పుడే లోక్‌సభ‌కు ఎన్నికైన వాజ్ పేయికి నెహ్రూ కోపంపై తెలిసింది. 
 
దీంతో వాజ్ పేయి స్పందిస్తూ.. పండిట్ నెహ్రూజీ రోజూ శీర్షాసనం వేస్తారని తనకు తెలుసు.. ఆయన్ని అలాగే వేయనిస్తే సరిపోతుంది. కానీ అదే శీర్షాసనంతోనే తన పార్టీ జెండాను చూడొద్దంటూ మనవి చేసుకుంటున్నానని అటల్ జీ సెటైర్లు వేశారు. మరుసటి రోజు ఈ వార్తను చదివిన నెహ్రూ అక్కడే పడీపడీ నవ్వారు. ఇలా తీవ్రంగా విమర్శించే ప్రత్యర్థులను సైతం తన వాక్పటిమతో వాజ్ పేయి కట్టిపడేసేవారు. అంతేకాదు, విదేశాంగ విధానంలో నెహ్రూనే తనకు ఆదర్శమని వాజ్ పేయి చాలాసార్లు చెప్పుకున్నారు.
 
* అలాగే 1980 దశకం నాటి సంగతి. అటల్ బిహారీ వాజ్ పేయి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా 1980 నుంచి 1986 వరకూ పనిచేశారన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి టాక్సీ వేసుకుని వచ్చి అందరినీ ఆశ్చర్య పరిచారు.
 
* మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి గడచిన తొమ్మిదేళ్లుగా ప్రజా జీవితానికి దూరంగా గడిపారు. ఇంటికి మాత్రమే పరిమితమై, వినికిడి శక్తి, జ్ఞాపక శక్తి కోల్పోయిన పరిస్థితుల్లో తన చివరి నాలుగైదేళ్లూ దత్త పుత్రిక సంరక్షణలో గడిపారన్న సంగతి తెలిసిందే. 2009లో ఆయనకు వచ్చిన గుండెపోటు, ఓ మహానేతను ప్రజలకు, కోట్లాది మంది బీజేపీ కార్యకర్తలకు దూరం చేసింది. 
 
* గుండెపోటు తరువాత ఆయన మెదడులోని కొన్ని నరాలు దెబ్బతిన్నాయి. చెవి నరాలకు ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో ఆయన క్రమంగా వినికిడి శక్తిని కోల్పోయారు. ఆ దశలో దాదాపు రెండేళ్ల పాటు తన పార్టీ నేతలను కలుస్తూనే ఉన్నారు. ఆ తరువాత ఆయనకు జ్ఞాపకశక్తి మందగించడం మొదలైంది. దీనికి కూడా గుండెపోటే కారణం.
 
* అటల్ బిహారీ వాజ్ పేయి పెళ్లి చేసుకోకుండా జీవితాంతం అవివాహితుడిగానే ఉండిపోయారు. తనకు పెళ్లి చేసుకునే తీరికే లేదని పలుమార్లు వాజ్ పేయి మీడియాతో అన్నారు. 1999లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక వాజ్ పేయి మీడియాకు ఓసారి విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో మూడుసార్లు ప్రధానిని పెళ్లి గురించి ఓ జర్నలిస్ట్ అడిగింది. అయినా ఆయన చాకచక్యమైన సమాధానాలతో ఆ జర్నలిస్ట్ పెళ్లి గురించి మాటెత్తడం మానేసింది.
 
* 1971 లోక్ సభ ఎన్నికలు. ఇందిర నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ 352 సీట్లలో ఘనవిజయం సాధించింది. అయితే 1967 ఎన్నికల్లో 35 లోక్ సభ సీట్లు గెలిచి మంచి ప్రదర్శన చేసిన జన్ సంఘ్.. మరో ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో మాత్రం 22 సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఆర్సెస్సెస్ నేత అప్పా ఘటాటేకు వాజ్ పేయి ఓసారి ఎదురుపడ్డారు.
 
* ఆ సమయంలో అప్పా ఘటాటే ఇందిరాగాంధీ ఇప్పుడు మీపట్ల ఎలా ఉన్నారని అటల్‌జీని అడిగారు. ఎన్నికల్లో సీట్లు కోల్పోయినా వాజ్ పేయి మాత్రం జోక్‌లు వేసే అలవాటును వదులుకోలేదు. అప్పా ఘటాటే ప్రశ్నకు వెంటనే స్పందిస్తూ.. ఏముంది? ఎన్నికల్లో 13 సీట్లు పోగొట్టుకున్నాక కూడా ఇందిర తమపై మరింత అభిమానంతోనే చూస్తున్నారంటూ చమత్కరించారు. ఈ సమాధానానికి అక్కడున్నవారంతా నవ్వుకున్నారు.