బ్రిటిష్ ఎయిర్ వేస్‌పై హ్యాకర్స్ షాక్.. 3.8 లక్షల క్రెడిట్ కార్డ్స్ బ్లాక్..
విమాన సంస్థ బ్రిటిష్ ఎయిర్ వేస్‌కు హ్యాకర్లు షాకిచ్చారు. హ్యాకర్లు బ్రిటిష్ వాళ్ల కంపెనీ వెబ్‌సైట్స్, మెుబైల్ యాప్స్‌పై దాడిచేసి 3.8 లక్షల క్రెడిట్ కార్డుల వివరాలను కనిపెట్టారు. అంతేకాకుండా ఈ యాప్స్ వ
విమాన సంస్థ బ్రిటిష్ ఎయిర్ వేస్‌కు హ్యాకర్లు షాకిచ్చారు. హ్యాకర్లు బ్రిటిష్ వాళ్ల కంపెనీ వెబ్‌సైట్స్, మెుబైల్ యాప్స్‌పై దాడిచేసి 3.8 లక్షల క్రెడిట్ కార్డుల వివరాలను కనిపెట్టారు. అంతేకాకుండా ఈ యాప్స్ వలన టికెట్ బుక్ చేసుకున్న వారి పేర్లను, మెయిల్ ఖాతా వివరాలను మెుత్తం తెలుసుకున్నారు. ఆగస్టు 21 నుండి సెప్టెంబర్ 5వ తేది మధ్యలో ఈ ఘటన జరిగింది.
తమ ప్రమేయం లేకుండానే వాళ్ల క్రెడిట్ కార్డును వాడినట్లు పలువురికి మెసేజెస్ వెళ్లాయి. ఈ విషయాలపై స్పందించిన బ్రిటిష్ ఎయిర్వేస్ సీఈవో అలెక్స్ క్రూజ్.. తమ కంపెనీలపై సైబర్ దాడి జరిగినదనీ, దాదాపు 3.8 లక్షల మందికి సంబంధించిన వివరాలు వారి క్రెడిట్ కార్డుల సమాచారాలు హ్యకర్లకు చిక్కిందని చెప్పాడు.
ఈ విషయం గురించి బ్రిటిష్ నేషనల్ క్రైమ్ ఏజెన్సీకి ఫిర్యాదు చేశామని, వారు ప్రస్తుతం వాటి వివరాలను తెలుసుకుంటున్నారని క్రూజ్ తెలియజేశాడు. అలానే ఆగస్టు 21 నుండి సెప్టెంబర్ 5 వరకు మా వెబ్‌సైట్స్, యాప్స్ నుండి క్రెడిట్ కార్డు ద్వారా టికెట్ బుక్ చేసిన వారి కార్డులను వెంటనే బ్లాక్ చేయాలని సూచించారు.