మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : శనివారం, 11 ఆగస్టు 2018 (17:14 IST)

బ్రిటీష్ ఎయిర్‌వేస్ ఓవరాక్షన్.. రిషీ కపూర్‌ గ్లాసుడు మంచినీళ్లు అడిగితే?

మొన్నటికి మొన్న పిల్లాడు ఏడుపు ఆపలేదని.. ఏడుపు ఆపకుంటే విమానం నుంచి బయటకు విసిరేస్తానని జాతి వివక్ష చూపిన బ్రిటీష్ ఎయిర్‌వేస్ సిబ్బంది.. భారతీయుడి పట్ల మళ్లీ ఓవరాక్షన్ చేశారు. బ్రిటీష్ ఎయిర్‌వేస్ సిబ్

మొన్నటికి మొన్న పిల్లాడు ఏడుపు ఆపలేదని.. ఏడుపు ఆపకుంటే విమానం నుంచి బయటకు విసిరేస్తానని జాతి వివక్ష చూపిన బ్రిటీష్ ఎయిర్‌వేస్ సిబ్బంది.. భారతీయుడి పట్ల మళ్లీ ఓవరాక్షన్ చేశారు. బ్రిటీష్ ఎయిర్‌వేస్ సిబ్బంది భారతీయులను చిన్నచూపు చూస్తున్నారని నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో బాలీవుడ్ హీరో రిషి కపూర్ కూడా సోషల్ మీడియా వేదికగా బ్రిటీష్ ఎయిర్‌వేస్ జర్నీ వద్దంటూ పోస్టు పెట్టారు. 
 
ఈ నేపథ్యంలో రిషి కపూర్ కూడా ఇలా నెట్టింట పోస్టు చేయడంతో సెలెబ్రిటీలందరూ కన్నెర్ర చేశారు. తాజాగా పూజా హెగ్డే కూడా తన స్నేహితుడు ఎదుర్కొన్న విషయాన్ని వెల్లడిస్తూ బ్రిటీష్ ఎయిర్ వేస్ పట్ల మండిపడింది. బ్రిటీష్ ఎయిర్‌వేస్ సిబ్బంది చేతిలో తాను జాతివివక్షకు గురయ్యాననే విషయాన్ని తన స్నేహితుడైన రిషీ కపూర్ తనతో చెప్పాడంది.
 
అతడు కేవలం ఒక గ్లాస్ మంచి నీళ్లు అడిగితే వారు ఇవ్వకుండా రెండు గంటల పాటు వెయిట్ చేయించారు. కానీ పక్కనే ఉన్న మరో విదేశీయుడికి గ్యాప్ లేకుండా మద్యం సప్లై చేశారు. బ్రిటీష్ ఎయిర్ వేస్ సిబ్బంది చాలా అసహ్యకరంగా ప్రవర్తించారంటూ పూజా తెలిపింది. బ్రిటీష్ ఎయిర్ వేస్ సిబ్బంది తీరు ఏమాత్రం బాగోలేదని పూజా హెగ్డే ఫైర్ అయ్యింది.