1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. SVC 59 poster released with Vijay Deverakonda's birthday wishes

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

SVC 59
SVC 59
స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో క్రేజీ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. 'రాజా వారు రాణి గారు' సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
 
ఈ రోజు హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ "ఎస్ వీసీ  59" మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు.   ఈ పోస్టర్ ఇంటెన్స్ గా ఉండి ఆకట్టుకుంటోంది. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా రూపొందనుంది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్  షూటింగ్ ప్రారంభించనున్నారు.
తర్వాతి కథనం
రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ