1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. andhra pradesh : another case filed on ys jagan mohan redd

మాజీ సీఎం జగన్‌పై మరో కేసు నమోదు

jagan
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. గత ఫిబ్రవరి 19వ తేదీన ఆయన గుంటూరు జిల్లా మిర్చియార్డు పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ, పోలీసుల అనుమతి లేకుండా ఈ పర్యటనకువచ్చారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు వైకాపా నేతలకు నల్లపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు. 
 
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్పప్పటికీ వైకాపా నేతలు అనుమతి లేకుండా వచ్చి హడావుడి చేశారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే యార్డులో జగన్ రాజకీయ ప్రసంగాలు చేశారు. ఈ నేపథ్యంలో జగన్‌తో పాటు నేతలు అంబటి రాంబాబు, లేళ్ళ అప్పిరెడ్డి, కావడి మనోహర్ నాయుడు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులపై కేసు నమోదైంది.
 
ఇప్పటికే పోలీసులు వారికి 41ఏ నోటీసులు ఇచ్చారు. పిలిచినపుడు నల్లపాడు ఠాణాకు విచారణకు రావాలని సూచించారు. కాగా, పల్నాడు జిల్లాలోని రెంటపాళ్లలో జగన్ పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా చిలీ సింగయ్య అనే వ్యక్తి జగన్ కారు కింద పడి మృతి చెందాడు. దీనిపై జగన్‌పై ఇప్పటికే కేసు నమోదైన విషయం తెల్సిందే. 
తర్వాతి కథనం
ఇజ్రాయెల్ - ఇరాన్‌లు కాల్పుల విరమణ - దిగివచ్చిన క్రూడ్ ఆయిల్ ధరలు