ఫిలడెల్ఫియా: సాటి వారికి సాయం చేయడంలో ఎప్పుడూ ఉత్తర అమెరికా తెలుగు సంఘం ముందుంటుందనేది నాట్స్ మరోసారి నిరూపించింది. నాట్స్ ఫిలడెల్ఫియా విభాగం ఆధ్వర్యంలో తెలుగు వారు తమకు వీలైనంత విరాళాన్ని ఇచ్చి అలా వచ్చిన మొత్తాన్ని స్థానికంగా పేదల ఆకలి తీర్చే మన్న ఆన్ మెయిన్ స్ట్రీట్ ఫుడ్ ప్యాంట్రీకి విరాళంగా అందించారు. మొత్తం 8 వేల డాలర్లను ఈ ఫ్యాంట్రీకి నాట్స్ విరాళంగా అందించింది.
నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హరినాథ్ బుంగటావుల నేతృత్వంలో ఈ వితరణ కార్యక్రమం జరిగింది. నిరుపేదలకు ఆకలి బాధలు లేకుండా చేయడంలో తమ వంతు సాయం చేయాలనే సంకల్పంతో తెలుగు వారు నాట్స్ ద్వారా ఈ విరాళాన్ని అందించారు. పేదల ఆకలి తీర్చే ప్రయత్నం చేసిన నాట్స్ ఫిలడెల్ఫియా విభాగాన్ని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీధర్ అప్పసాని ప్రత్యేకంగా అభినందించారు.
ఫుడ్ ఫ్యాంట్రీ కోసం నాట్స్‌కు విరాళాలు ఇచ్చిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
1. హరినాథ్, రాధిక బుంగాటవుల - $1000
2. వైజ్లీ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైర్ (మధు, సునీత బుదాతి) - $500
3. వెంకట్, సుజనా సాకమూరి - $500
4. సురేష్, లావణ్య బొందుగుల - $402
5. సీతారాం ముక్కామల - $302
6. రమణ, భార్గవి రాకోతు - $278
7. రవి మరియు రంగలక్ష్మి ఇంద్రకంటి - $240
8. సుబాష్, స్మిత కర్రా - $232
9. విజయ్, అంజు వేమగిరి - $222
10. అప్పారావు, సుజాత మల్లిపూడి - $202
11. భాస్కర్ యాడ్ శ్రావణి మక్కెన - $202
12. భువన్ పేష్వా - $202
13. కల్పనా వల్లభనేని, ప్రవీణ్ - $202
14. లక్ష్మి మంద, సోమేష్ - $202
15. మహేష్, స్వప్న రామనాధం - $202
16. రామ్ నరేష్, కమల కొమ్మనబోయిన - $202
17. రవి, అనుపమ అబ్బినేని - $202
18. రవి, రాజశ్రీ జమ్మలమడక - $202
19. సతీష్, కవిత పుల్యపూడి - $202
20. సురేంద్ర, రాజ్యలక్ష్మి కొరిటాల - $202
21. బాబు, హిమబిందు మేడి - $200
22. గౌరీ, శశికళ కర్రోతు - $200
23. జగదీష్ యర్రా - $200
24. కళ్యాణ్, ప్రియా ఆచంట - $200
25. మధు, దీక్షా కొల్లి - $200
26. ముజీబుర్ రెహ్మాన్, కరుణ - $200
27. నిరంజన్, కమలాజ యనమండ్ర - $200
28. రామకృష్ణ, దీప్తి గొర్రెపాటి - $200
29. శివ, విజయ అనంతుని - $200
30. విక్రమ్, నిఖిలా అర్జుల - $200
31. శ్రీనివాస్, సుధా ప్రభ - $102