సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 7 ఏప్రియల్ 2018 (14:52 IST)

పేపర్లు అమ్ముకునేందుకు నెగెటివ్ కథనాలు రాయొద్దు... సల్మాన్ మంచోడు : కపిల్

కృష్ణ జింకలను వేటాడి హతమార్చిన కేసులో ఐదేళ్లు జైలుశిక్ష పడిన బాలీవుడ్ హీరో సన్మాన్ ఖాన్‌కు బాలీవుడ్ యావత్ నుంచి మద్దతు లభిస్తోంది. సల్మాన్ చాలా మంచోడనీ, ఆయన చేసిన అనేక మంచి పనులను చూడాలంటూ పలువురు అభి

కృష్ణ జింకలను వేటాడి హతమార్చిన కేసులో ఐదేళ్లు జైలుశిక్ష పడిన బాలీవుడ్ హీరో సన్మాన్ ఖాన్‌కు బాలీవుడ్ యావత్ నుంచి మద్దతు లభిస్తోంది. సల్మాన్ చాలా మంచోడనీ, ఆయన చేసిన అనేక మంచి పనులను చూడాలంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే, బాలీవుడ్ ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ వంటివారు మాత్రం ఒకింత దూకుడుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. 
 
సల్మాన్‌ జైలు శిక్షపై కపిల్‌ శర్మ స్పందిస్తూ, 'నేను ఎంతోమంది బడాబాబులను చూశాను. తాము సింహాలను వేటాడేవాళ్లమని వాళ్లు గర్వంగా చెప్పుకొనేవాళ్లను నేను కలిశాను. సల్మాన్‌ మంచి వ్యక్తి. ఆయన ఆ తప్పు చేశారో లేదో తెలియదు. కానీ ఆయనలోని మంచి కోణాన్ని చూడండి. చెత్త వ్యవస్థ. మంచి పనిచేయనివ్వదు' అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లు ఇపుడు వివాదాస్పదమయ్యాయి. 
 
అంతేకాకుండా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, పేపర్లు అమ్ముకునేందుకు, టీఆర్పీ రేటింగ్స్ కోసం నెగెటివ్ కథనాలు రాయకండి, ప్రసారం చేయకండి. అతను మంచి వ్యక్తి. త్వరలోనే జైలునుంచి బయటకు వస్తాడు. ఎంతో పెద్ద పెద్ద ఘోరాలు జరిగినా మీరు మాట్లాడరు. నెగిటివ్‌ వార్తలు ప్రచారం చేసేందుకు ఎంతో తీసుకుంటారని ప్రశ్నించారు. 
 
'చెత్త వ్యవస్థ, చెత్త మనుషులు. నేనే ప్రధానమంత్రిని అయి ఉంటే.. ఫేక్ న్యూస్‌ సృష్టించేవారిని ఉరితీసి ఉండేవాడిని' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్లపై తీవ్ర విమర్శలు రావడంతో వాటిని తొలగించిన కపిల్‌ శర్మ... తన అకౌంట్ హ్యాక్ అయిందని, వాటిని పట్టించుకోవద్దని సలహా ఇచ్చాడు. ఆ కొద్దిసేపటికే తన ట్వీట్లను కూడా తొలగించడం గమనార్హం. 
 
కాగా, 20 యేళ్ల నాటి కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ మేజిస్ట్రేట్ కోర్టు ఐదేళ్ళ జైలుతో పాటు రూ.10 వేల అపరాధాన్ని విధిస్తూ తీర్పునిచ్చిన విషయం తెల్సిందే. దీంతో ఆయన్ను జోధ్‌పూర్ మేజిస్ట్రేట్ కోర్టుకు తరలించారు. కాగా, బెయిల్ కోసం సల్మాన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ ఏప్రిల్ 7వ తేదీన విచారణకు రానుంది.