గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 9 జనవరి 2018 (15:45 IST)

ఇకపై ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా ఇండేన్ గ్యాస్ బుకింగ్

ఇండియన్ ఆయిల్ గ్యాస్ (ఇండేన్) సంస్థ వంట గ్యాస్ వినియోగదారులకు ఓ శుభవార్త. ఇకపై ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల ద్వార గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం రిజిస్టర్ మొబైల్ నంబరు ద్వారా మాత్రమే గ్యాస్ బుకింగ్ చేసు

ఇండియన్ ఆయిల్ గ్యాస్ (ఇండేన్) సంస్థ వంట గ్యాస్ వినియోగదారులకు ఓ శుభవార్త. ఇకపై ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల ద్వార గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం రిజిస్టర్ మొబైల్ నంబరు ద్వారా మాత్రమే గ్యాస్ బుకింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ పరిస్థితుల్లో తాజాగా గ్యాస్ బుకింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. 
 
ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా గ్యాస్‌ను బుక్ చేసుకునే సౌకర్యం వినియోగదారులకు బాగా ఉపయోగపడుతుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అభిప్రాయపడింది. ఫేస్‌బుక్ ద్వారా గ్యాస్‌ను బుక్ చేసుకునే వారు మొదటగా ఫేస్‌బుక్‌ను లాగిన్ అవ్వాలి. 
 
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అఫిషియల్ పేజీ @indianoilcorplimited ద్వారా బుక్ చేసుకోవాలి. ఈ పేజీలోకి వెళ్లిన తర్వాత అక్కడ బుక్ నౌను క్లిక్ చేసి గ్యాస్ బుక్ చేసుకోవాలని సూచించింది. ట్విట్టర్ ద్వారా చేసుకోవాలనుకునే వారు.. మొదట తమ పేజీని లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత @indanerefill ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపింది.