సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 9 జనవరి 2018 (11:05 IST)

జియో 2018 ప్లాన్, ఎయిర్‌టెల్-వోడాఫోన్ దిమ్మతిరిగే ప్లాన్... వివరాలు...

జియో మరోసారి ప్రత్యర్థి టెలికం సంస్థలైన ఎయిర్ టెల్, వోడాఫోన్ దిమ్మతిరిగేలా కొత్త ప్లాన్లతో ముందుకు రాబోతోంది. ఇప్పటివరకూ రూ. 199తో 28 రోజుల వ్యాలిడిటీతో ఇచ్చే 28 జిబి డేటాను కేవలం రూ. 149కే ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. అలాగే మిగిలిన టారిఫ్ లలో కూడా భ

జియో మరోసారి ప్రత్యర్థి టెలికం సంస్థలైన ఎయిర్ టెల్, వోడాఫోన్ దిమ్మతిరిగేలా కొత్త ప్లాన్లతో ముందుకు రాబోతోంది. ఇప్పటివరకూ రూ. 199తో 28 రోజుల వ్యాలిడిటీతో ఇచ్చే 28 జిబి డేటాను కేవలం రూ. 149కే ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. అలాగే మిగిలిన టారిఫ్ లలో కూడా భారీ స్థాయిలో మార్పులు చేసి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 
 
ఇంతకుముందు రూ. 399కి 70 రోజుల వ్యాలిడిటీతో ఇచ్చే ప్యాక్ ను రూ. 349కే ఇవ్వనున్నది. అలాగే రూ. 499 ని రూ. 449కే ఇవ్వబోతోంది. కాగా ఎయిర్ టెల్ ఇప్పటికే రూ. 448కే 82 రోజుల వ్యాలిడీటితో ప్యాక్ ఇస్తోంది. అలాగే రూ. 509కే 91 రోజుల వ్యాలిడీతో మరో ప్యాక్ ఇస్తోంది. వొడాఫోన్ కూడా రూ. 458తో 70 రోజులకు, రూ. 509తో 91 రోజులకు ఇస్తోంది. మరి జియో ప్రవేశపెట్టబోయే కొత్త ప్లాన్లతో ఎయిర్ టెల్, వొడాఫోన్ ఏం చేస్తాయో చూడాలి.