మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 19 డిశెంబరు 2017 (10:38 IST)

యుఐడీఏఐ నిషేధం... కాళ్లావేళ్లా పడుతున్న ఎయిర్‌టెల్

దేశంలోని ప్రైవేట్ టెలికాం దిగ్గజ కంపెనీ ఎయిర్‌టెల్‌పై ఆధార్ కార్డు జారీ సంస్థ యుఐడీఏఐ (యునిక్యూ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా) కొరఢా ఝుళిపించింది.

దేశంలోని ప్రైవేట్ టెలికాం దిగ్గజ కంపెనీ ఎయిర్‌టెల్‌పై ఆధార్ కార్డు జారీ సంస్థ యుఐడీఏఐ (యునిక్యూ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా) కొరఢా ఝుళిపించింది. ఇందులోభాగంగా, పలు ఎయిర్‌టెల్ సేవలను రద్దు చేసింది. వీటిలో ప్రధానమైనది ఎయిర్‌ పేమెంట్స్ బ్యాంక్ ఒకటి. అలాగే, మొబైల్ నంబరుకు, ఆధార్ కార్డు అనుసంధాన ప్రక్రియ. దీంతో దిగివచ్చిన ఎయిర్‌టెల్ కాళ్లావేళ్లా పడుతోంది. 
 
అర్హులైన లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్యాస్ రాయితీని ఎయిర్‌టెల్ అక్రమంగా నొక్కేసింది. ఆధార్ కార్డు అనుసంధానం చేసిన అనేక మంది లబ్ధిదారులకు ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇలా రూ.190 కోట్లను ఎయిర్‌టెల్ పేమెంట్స్‌బ్యాంక్‌ ఖాతాల్లోకి చేరింది. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 
 
దీంతో రంగంలోకి దిగిన యుఐడీఏఐ లోతుగా తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో ఏకంగా 31 లక్షల మంది ఎయిర్‌టెల్‌ మొబైల్‌ వినియోగదారులకు చెందిన ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌బ్యాంక్‌ ఖాతాల్లో గ్యాస్‌ రాయితీ నగదు జమైనట్టు తేల్చింది. 
 
ఇపుడు ఈ మొత్తానికి వడ్డీతో కలిపి గ్యాస్‌ సబ్సిడీ జమయ్యే బ్యాంక్‌ ఖాతాలకు బదిలీ చేస్తామని తెలుపుతూ, నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ)కు ఎయిర్‌టెల్‌ లేఖ రాసింది. 
 
అంతేకాకుండా, ఆధార్ - సిమ్ అనుసంధాన ధ్రువీకరణ లైసెన్సును కూడా తాత్కాలికంగానూ, పేమెంట్స్‌బ్యాంక్‌ ఖాతాదారులకు ఎలక్ట్రానిక్‌ (ఇ) కేవైసీ నిర్వహించడాన్నీ రద్దు చేసింది.

భారతీ ఎయిర్‌టెల్‌, ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌బ్యాంక్‌లలో ఆడిట్‌ నిర్వహించాలని ప్రైస్‌ వాటర్‌హౌస్‌ కూపర్స్‌ను ఆధార్‌ జారీ సంస్థ యూఐడీఏఐ కోరింది. ఆధార్‌ చట్టానికి అనుగుణంగా ఆయా సంస్థలు వ్యవహరిస్తోందీ, లేనిదీ పరిశీలించాలని ఆదేశించింది.