శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 18 డిశెంబరు 2017 (12:08 IST)

ఎయిర్‌టెల్‌కు యూఐడీఏఐ షాక్: కస్టమర్ల అనుమతి లేకుండా?

ఆధార్‌ను దుర్వినియోగం చేసినందుకు గాను టెలికాం సంస్థ ఎయిర్‌టె‌ల్‌కు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) షాక్ ఇచ్చింది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ టెలికాం సంస్థగా పేరున్న ఎయిర్‌టెల్..

ఆధార్‌ను దుర్వినియోగం చేసినందుకు గాను టెలికాం సంస్థ ఎయిర్‌టె‌ల్‌కు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) షాక్ ఇచ్చింది.

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ టెలికాం సంస్థగా పేరున్న ఎయిర్‌టెల్.. ఖాతాదారుల అనుమతి లేకుండానే పేమెంట్స్ బ్యాంకుల్లోకి మళ్లించడంతో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు ఈ-కేవైసీ లైసెన్స్‌ను యూఐడీఏఐ సస్పెండ్ చేసింది. ఇది తక్షణమే అమలవుతుందని పేర్కొంది. 
 
యూఐడీఏఐ నిర్ణయంతో ఈ రెండు సంస్థలు తమ ఖాతాదారుల ఈ-కేవైసీ ప్రక్రియకు తక్షణం ఫుల్‌స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. ఫలితంగా ఎయిర్‌టెల్ తన ఖాతాదారుల ఆధార్ నంబర్లను సిమ్‌తో అనుసంధానించే ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడనుంది. 
 
కస్టమర్ల అనుమతి లేకుండా ఈ-కేవైసీ ద్వారా తమ మొబైల్ వినియోగదారుల పేరిట పేమెంట్ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నట్టు యూఐడీఏఐకి ఎయిర్‌టెల్‌పై ఫిర్యాదులు అందాయి. వంటగ్యాస్ సబ్సిడీని బ్యాంకు ఖాతాలకు మళ్లిస్తూ మొత్తం 23లక్షల మందికిపైగా ఖాతాదారుల నుంచి దాదాపు రూ.47 కోట్ల వరకు జమ అయ్యాయి. దీనిపై స్పందించిన యూఐడీఏఐ.. ఎయిర్‌టెల్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు ఈ-కేవైసీ లైసెన్స్‌లను తాత్కాలికంగా రద్దు చేసింది.