మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 25 నవంబరు 2017 (09:29 IST)

ఎయిర్‌టెల్ మరో కొత్త ఆఫర్.. సెలెక్టడ్ కస్టమర్లకు మాత్రమే...

ప్రైవేట్ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ సంస్థ తమ ప్రీపెయిడ్ వినియోదారుల కోసం సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. అయితే, ఈ ఆఫర్ కేవలం తెలుగు రాష్ట్రాల కస్టమర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చింది.

ప్రైవేట్ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ సంస్థ తమ ప్రీపెయిడ్ వినియోదారుల కోసం సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. అయితే, ఈ ఆఫర్ కేవలం తెలుగు రాష్ట్రాల కస్టమర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. ఈ బంపర్ ఆఫర్ కింద రూ.198కు రీచార్జ్ చేస్తే రోజుకు ఒక్క జీబీ డేటాతో పాటు అపరిమిత ఫోన్ కాల్స్‌ను చేసుకోవచ్చు. దీని వ్యాలిడిటీ 28 రోజులు.
 
అయితే, ఈ ప్లాన్‌‍కు అర్హులో కాదో తెలుసుకోవాలంటే మై ఎయిర్‌టెల్‌యాప్‌‌ను ఓపెన్ చేసి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బెస్ట్‌ ఆఫర్స్‌ ఫర్‌ యూలో రూ.198 ఆఫర్‌ అయితే దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినప్పటికి మై ఎయిర్‌టెల్‌ యాప్‌లో బెస్ట్‌ ఆఫర్స్‌ ఫర్‌ యూలో రూ.198 ఆఫర్‌ కనిపిస్తోంది. ఇప్పటికే రూ.199 రీచార్జ్‌పై అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌‌తోపాటు రోజుకి 1 జీబీ 4జీ డేటాను ఎయిర్‌టెల్ అందిస్తున్న విషయం తెల్సిందే.