శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 29 డిశెంబరు 2017 (12:30 IST)

జియో దెబ్బకు ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్.. రూ.93 ప్లాన్‌తో 1 జీబీ డేటా

జియో దెబ్బకు టెలికాం సంస్థలన్నీ ఆఫర్లు ఇవ్వడంలో పోటీపడుతున్నాయి. ఇటీవల రూ. 98 రీఛార్జీతో 14 రోజుల వ్యాలిడిటీ, 2.1 జీబీ డేటా ఆఫ‌ర్‌ను జియో ప్ర‌వేశ‌పెట్టింది. ఇందుకు పోటీగా టెలికాం దిగ్గ‌జం ఎయిర్‌టెల్ ర

జియో దెబ్బకు టెలికాం సంస్థలన్నీ ఆఫర్లు ఇవ్వడంలో పోటీపడుతున్నాయి. ఇటీవల రూ. 98 రీఛార్జీతో 14 రోజుల వ్యాలిడిటీ, 2.1 జీబీ డేటా ఆఫ‌ర్‌ను జియో ప్ర‌వేశ‌పెట్టింది. ఇందుకు పోటీగా టెలికాం దిగ్గ‌జం ఎయిర్‌టెల్ రూ.5 తగ్గించి రూ.93 రీఛార్జీ ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ప్లాన్ ద్వారా పదిరోజుల వ్యాలిడిటీతో ఒక జీబీ డేటాను అందజేస్తుంది.
 
వ్యాలిడిటీ విషయంలో స్వ‌ల్ప తేడా ఉన్న జియో మాదిరిగా రోజుకి 0.15 జీబీ మాత్ర‌మే వాడుకోవాల‌ని ఎయిర్‌టెల్ ప‌రిమితుల‌ను విధించ‌లేదు. అలాగే అప‌రిమిత లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్‌, రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల‌ను అంద‌జేస్తోంది.  
 
ఇకపోతే ఎయిర్‌టెల్ రూ.199 ప్రీ-పెయిడ్ ప్లానును ప్రకటించింది. ఈ ప్లాన్ ప్రకారం రోజుకు 1జీబీ డేటాతో 28 రోజులు అన్ లిమిటెడ్ కాల్స్, వంద ఎస్సెమ్మెస్‌లు అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా జియో హ్యాపీ న్యూయర్ 2018 ప్యాక్‌కు ఎయిర్‌టెల్ పోటీ ఇచ్చింది. జియో కొత్త సంవత్సరం సందర్భంగా రూ.199లకు రోజుకు 1.2జీబీ 4జీ డేటాను 28 రోజులకు అందించనుంది.