ఇకపై కంప్యూటర్లలోనూ జియో సినిమాలు.. వెబ్ వెర్షన్ ప్రారంభం

దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో తన వినియోగదారులకు మరో శుభవార్త తెలిపింది. జియో టీవీ, జియో సినిమా యాప్స్ ఇకపై కంప్యూటర్లలోనూ చూడొచ్చు. ఇప్పటివరకు ఫోన్లో మాత్రమే అందుబాటుల

JioFi
selvi| Last Updated: సోమవారం, 18 డిశెంబరు 2017 (07:28 IST)
దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో తన వినియోగదారులకు మరో శుభవార్త తెలిపింది. జియో టీవీ, జియో సినిమా యాప్స్ ఇకపై కంప్యూటర్లలోనూ చూడొచ్చు. ఇప్పటివరకు ఫోన్లో మాత్రమే అందుబాటులో వున్న జియోటీవీ.. ఇకపై వెబ్ సైట్ల వెర్షన్ ద్వారా కంప్యూటర్లలో చూసే సదుపాయాన్ని కల్పించనున్నట్లు జియో ప్రకటించింది.

జియో టీవీలో తెలుగు, హిందీ సహా 550 లైవ్ చానల్స్ అందుబాటులో ఉన్నాయి. వినియోగదారుల అభ్యర్థన మేరకు ప్రస్తుతం యాప్స్ రూపంలో వున్న వీటిని వెబ్ వెర్షన్‌లోకి తీసుకొస్తే బాగుంటుందని వినియోగదారుల నుంచి అభ్యర్థనలు రావడంతోనే.. వెబ్ వెర్షన్లను అందుబాటులోకి తెచ్చామని జియో అధికారులు ప్రకటించారు. తద్వారా ఇప్పటివరకు స్మార్ట్ ఫోన్లు, జియో ఫోన్లలో మాత్రమే అందులో వుండే జియో టీవీ, జియో సినిమాలను ఇకపై కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల్లో చూసుకునే అవకాశం ఉంటుంది.దీనిపై మరింత చదవండి :