సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 18 మార్చి 2018 (14:35 IST)

ఫీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలా? జస్ట్ మిస్డ్ కాల్ ఇవ్వండి చాలు..

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ ఎంప్లాయీస్ (ఈపీఎఫ్) పథకంలోని ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరో వెసులుబాటు కల్పించింది. ఎవరైతే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్) పోర్టల్‌లోనూ రిజస్టర్ అయిన వార

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ ఎంప్లాయీస్ (ఈపీఎఫ్) పథకంలోని ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరో వెసులుబాటు కల్పించింది. ఎవరైతే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్) పోర్టల్‌లోనూ రిజస్టర్ అయిన వారు కేవలం ఒక్క మిస్డ్ కాల్‌తో పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకునే వీలుంటుంది.

ఉద్యోగస్తులు పీఎఫ్‌లో ఎంతుందో సులభంగా పొందేందుకు వీలుగా మిస్డ్ కాల్డ్‌ టెక్నాలజీని ప్రవేశపెట్టినట్లు కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది. ఇంగ్లీష్‌, హిందీతో పాటు మరో 8 భారతీయ భాషల్లో బ్యాలెన్స్‌ వివరాలు పొందవచ్చని కేంద్ర కార్మిక శాఖ చెప్పింది.
  
బ్యాంక్‌ బ్యాలెన్స్‌ వివరాలు పొందే తరహాలోనే పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చునని.. యూఏఎన్ పోర్టల్‌లో ఉద్యోగులు తెలిపిన తమ ఫోన్‌ నెంబర్‌ నుంచి 011-22901406కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలునని కేంద్ర కార్మిక శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
 
మిస్డ్ కాల్ ఇచ్చిన వెంటనే పీఎఫ్ మొత్తం ఎంత వుందనే వివరాలు ఎస్‌ఎంఎస్‌ ద్వారా అందుతాయి. ఈ సర్వీస్‌కు ఎలాంటి చార్జీలు ఉండబోవని కార్మిక శాఖ తెలిపింది. అదే విధంగా రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌ నుంచి ‘EPFOHO UAN’ అని టైప్‌ చేసి 7738299899 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేయడం ద్వారా కూడా వివరాలు పొందవచ్చునని కార్మిక శాఖాధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.