మంగళవారం, 2 సెప్టెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 29 ఆగస్టు 2025 (17:46 IST)

నా చిత్రాలేకాదు కొత్తవారికి అవకాశం కోసమే నిర్మాణసంస్థ ప్రారంభించా : రవి మోహన్

Kenisha, Ravi Mohan, Genelia, Riteish Deshmukh, Dr. Shivraj
Kenisha, Ravi Mohan, Genelia, Riteish Deshmukh, Dr. Shivraj
వైవిధ్యమైన సినిమాలతో హీరోగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న రవి మోహన్ ఇప్పుడు నిర్మాతగా మారారు. ఈ సందర్భంగా రవి మోహన్ స్టూడియోస్ లాంచింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శివ కార్తికేయన్, కార్తీ, జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 
 
ఈ కార్యక్రమంలో రవి మోహన్ తన “రవి మోహన్ స్టూడియోస్” నిర్మాణ సంస్థను అందరికీ పరిచయం చేశారు. అనంతరం తన ప్రొడక్షన్‌లో రాబోతోన్న రెండు సినిమాల గురించి చెప్పారు. ఈ రెండింటిలో ఓ సినిమాను రవి మోహన్ తెరకెక్కిస్తుండటం విశేషం.
 
Ravi Mohan Studios launch
Ravi Mohan Studios launch
రవి మోహన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఆయన స్వీయ దర్శకత్వంలో యోగి బాబు హీరోగా ఓ చిత్రం రానుండగా, దర్శకుడు కార్తీక్ యోగి దర్శకత్వంలో  రవి మోహన్, ఎస్.జె.సూర్య, అర్జున్ అశోకన్ ప్రధాన పాత్రల్లో  ‘బ్రో కోడ్’ సినిమా మరో సినిమాగా రూపొందనుంది. ఈ మూవీలో ఇంకా గౌరీ ప్రియ, శ్రద్ధా శ్రీనాథ్, మాళవిక మనోజ్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ సందర్భంగా...
 
హీరో కార్తీ మాట్లాడుతూ ..నేను రవిని స్టంట్ క్లాస్‌లో కలిశాను. అప్పుడు నేను ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చాను. రవి ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండేవారు. రవి ఇలా ఇంత గ్రాండ్‌గా నిర్మాణ సంస్థను ప్రారంభిస్తారని నేను ఎప్పుడూ ఊహించలేదు. రవి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. రవి ప్రొడక్షన్ కంపెనీలో రాబోతోన్న బ్రో కోడ్, యోగిబాబు ప్రాజెక్టులు విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు.
 
హీరో శివకార్తికేయన్ మాట్లాడుతూ, రవి, నాలా అందరు నటులు నిర్మాణ సంస్థలను ప్రారంభిస్తే, పరిశ్రమకు చాలా మంచి కథలు వస్తాయి.. మంచి పరిణామం చోటు చేసుకుంటుంది అని అన్నారు.  
 
దర్శకుడు రాజ మోహన్ మాట్లాడుతూ.. మీతో పని చేయడాన్ని గర్వంగా భావిస్తుంటానని అన్నారు. 
కన్నడ నటుడు డాక్టర్ శివరాజ్.. నేను రవి మోహన్ కోసం ఏమైనా చేస్తాను.. అతను చాలా మంచి వ్యక్తి అని అన్నారు.
 
హీరో, నిర్మాత, దర్శకుడు రవి మోహన్ మాట్లాడుతూ, ఇప్పుడు ఈ సమయంలో నేను ఎంత సంతోషంగా ఉన్నానో నాకు మాత్రమే తెలుసు. నేను, కార్తీ ఇద్దరం కూడా విలాసాలను కోరుకోం, పొన్నియిన్ సెల్వన్ షూటింగ్ సమయంలో మేం ఒకరినొకరం ఎంతో తెలుసుకున్నాం. సినిమా అనేది లక్షలాది మందికి వినోదం మాత్రమే కాదు, ఒక భావోద్వేగం. నాకు నా అభిమానులే ఈ ప్రయాణంలో అండగా నిలిచారు. వారి వల్లే ఈ స్థాయికి వచ్చాను. సినిమాలో నేను ఇంకా సాధించాల్సిన కలలు చాలా ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది నా స్వంత ప్రొడక్షన్ స్టూడియో. నేను ప్రారంభించిన ఈ కంపెనీ కేవలం నా సొంత చిత్రాల కోసమే కాదు. యువ, కొత్త దర్శకులకు అవకాశాలను ఇవ్వడం, ఎంతో మంది కలలకు రూపం ఇవ్వడం, సినిమాలు, OTT ప్లాట్‌ఫారమ్‌ల కోసం ప్రాజెక్టులు చేయడం నా ఉద్దేశం. కొత్త వారికి నేను ప్రాధాన్యం ఇస్తాను’ అని అన్నారు.
 
కెనిషా మాట్లాడుతూ.. నువ్వు (రవి మోహన్) నాకు ఓ మంచి కుటుంబాన్ని ఇచ్చావు. నా ఈ ప్రయాణం ఎంతో కష్టంగా సాగింది. కానీ నా కంటే ఎక్కువ కష్టాల్ని నువ్వు ఎదుర్కొన్నావు. నువ్వెప్పుడూ ఇతర జీవితాల్లో వెలుగులు నింపాలనే ప్రయత్నిస్తుంటారు. ఈ ప్రొడక్షన్ కంపెనీ పెట్టేందుకు చాలా కష్టపడ్డావు. నీకు ఎన్నో విజయాలు దక్కాలి అని రవి మోహన్ గురించి మాట్లాడారు.
 
నటుడు యోగిబాబు మాట్లాడుతూ.. ఆరేళ్ల క్రితం ఇచ్చిన మాట ప్రకారం అవకాశం ఇచ్చిన రవి మోహన్ గారికి థాంక్స్.  దర్శకత్వం చేస్తే ఆ మొదటి చిత్రంలో హీరోగా అవకాశం ఇస్తానని, ఇచ్చిన మాట ప్రకారం నాతో సినిమాను చేస్తున్నారని అన్నారు.
 
ఇంకా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు మాట్లాడుతూ రవి మోహన్ స్టూడియోస్ గొప్ప సక్సెస్‌ఫుల్ చిత్రాలను రూపొందించాలని అభిలషించారు.