శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 20 ఆగస్టు 2018 (17:33 IST)

కాలుజారి సముద్రంలో పడినా.. పది గంటల సేపు ఊపిరితో ఎలా వుండగలిగింది?

కాలు జారి సముద్రంలో పడిన ఓ మహిళ పది గంటల తర్వాత ప్రాణాలతో బయటపడిన ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. క్రొయేషియాకు చెందిన నార్వేజియన్‌ స్టార్ షిప్‌లో తన స్నేహితులతో కలిసి ప్రయాణిస్తున్న

కాలు జారి సముద్రంలో పడిన ఓ మహిళ పది గంటల తర్వాత ప్రాణాలతో బయటపడిన ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. క్రొయేషియాకు చెందిన నార్వేజియన్‌ స్టార్ షిప్‌లో తన స్నేహితులతో కలిసి ప్రయాణిస్తున్న బ్రిటన్‌కు చెందిన కేయ్ అనే మహిళ వున్నట్టుండి కాలుజారి సముద్రంలో పడిపోయింది. 
 
పడవ అంచున నిలబడి తన స్నేహితులతో మాట్లాడుతుండగా కాలుజారి నీటిలో పడిపోయింది, ఆమె పడిపోవడాన్ని గమనించిన ఇతర ప్రయాణికులు వెంటనే ఓడ కెప్టెన్‌కు సమాచారం అందించారు. మహిళ సముద్రంలో పడిన ప్రదేశం క్రొయేషియా తీరప్రాంతానికి 60 మైళ్ల దూరంలో ఉంది. వెంటనే వారు నేవీ అధికారులకు తెలియజేశారు. 
 
గాలుల వేగం, అలల తీరును గమనిస్తూ నేవీ, తీరప్రాంత అధికారులు పీసీ-9 విమానంతో గాలింపు చేపట్టి యువతిని సురక్షితంగా రక్షించారు. ఇలా సముద్రంలో పడిన మహిళ పది గంటల పాటు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బయటపడింది. అయితే, అంతసేపూ నీళ్లల్లో వున్నా ఆమె ప్రాణాలతో ఎలా బయటపడగలిగిందనే విషయం ఎవరికీ అంతుబట్టట్లేదు. ఆమె కూడా ఆ విషయాన్ని సరిగా చెప్పలేకపోతోంది.