శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 18 ఆగస్టు 2018 (15:56 IST)

బిగ్ బాస్ హౌస్‌లోకి గీత గోవిందం..

''గీత గోవిందం'' సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా బిగ్ బాస్ హౌస్‌లోకి గీత గోవిందం వెళ్లాలనుకుంటోంది. బిగ్ బాస్ హౌస్‌ను చాలా సినిమాలు ప్రమోషన్ కోసం ఉపయోగించుకున్న సంగతి తెలిసిందే

''గీత గోవిందం'' సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా బిగ్ బాస్ హౌస్‌లోకి గీత గోవిందం వెళ్లాలనుకుంటోంది. బిగ్ బాస్ హౌస్‌ను చాలా సినిమాలు ప్రమోషన్ కోసం ఉపయోగించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా గీత గోవిందం టీమ్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోతుందని సమాచారం.
 
విజయ్ దేవరకొండ, రష్మిక, దర్శకుడు పరశురామ్‌లు ఈ షోలో పాల్గొని తమ సినిమాను ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఇందులో భాగంగా ఈ శని, ఆదివారాలు రెండు రోజులు సినిమాను ఓ రేంజ్‌లో ప్రమోట్ చేసుకోబోతున్నారని తెలిసింది.
 
ఇక బన్నీ శనివారం ఈ టీమ్ కి పెద్ద పార్టీ ఇస్తుండగా, ఆదివారం చిత్రబృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇదంతా చూస్తే గీత గోవిందం సినిమా భారీ కలెక్షన్లు సాధించే అవకాశం వున్నట్లు టాక్.