1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Telegram Founder Pavel Durov Says He'll Leave Fortune To 100 Children Born Via Sperm Donation

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

pavel durov
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ మరోమారు వార్తల్లో నిలిచారు. వంద మంది పిల్లలకు జన్మనిచ్చానని, వారికి తన యావదాస్తి చెందేలా వీలునామా రాసినట్టు తెలిపారు. అయితే, వంద మంది పిల్లలకు తన వీర్యదానంతో జన్మనిచ్చానని చెప్పారు. ఈ మేరకు తన భవిష్యత్ ప్రణాళికను వెల్లడించారు. 
 
15 యేళ్ళపాటు తాను చేసిన వీర్యదానంతో ప్రపంచ వ్యాప్తంగా 12 దేశాల్లో 100 మంది పిల్లలు జన్మించినట్టు గత యేడాది జూలైలో ప్రకటించిన విషయం తెల్సిందే. తాజాగా ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్తావించిన ఆయన.. మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఇటీవలే తాను వీలునామా రాశాని, అందులో ఈ సంతానం గురించి కూడా పేర్కొన్నట్టు తెలిపారు. 
 
తాను సహజంగా జన్మనిచ్చిన సంతానంతో పాటు ఈ 100 మంది పిల్లలకు కూడా తన ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని వెల్లడించారు. దాదాపు 10 బిలియన్ డాలర్ల తన సంపదను వీరందరికీ సమానంగా పంచుతానని, తన వీలునామాలో పేర్కొన్నట్టు తెలిపారు. అయితే, ఈ సంపదను 30 యేళ్ల వరకు వారు పొందలేరని తన పిల్లలు స్వతంత్రంగా జీవించేలా ఎదగాలని  కోరుకుంటున్నట్టు పావెల్ పేర్కొన్నారు. 
 
తనకు ఇంకా వివాహం కానప్పటికీ తనకు ముగ్గురు సహజీవన భాగస్వాములు ఉన్నారని, వారికి ఆరుగురు సంతానం అని ఆయన తెలిపారు. తన జీవితం ఎన్నో సవాళ్లతో ముడిపడివుందని, ఎంతమంది శత్రువులు కూడా ఉన్నారని తెలిపారు. అందుకే 40 యేళ్ల వయుసులోనే వీలునామా రాయాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుంత ఈ కథనం నెట్టింట వైరల్‌గా మారింది.