శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (14:36 IST)

హర్యానా హరికేన్ బయోపిక్‌తో బన్నీ బాలీవుడ్ ఎంట్రీ

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. అదీకూడా ఓ క్రికెట్ లెజెండ్ బయోపిక్‌తో ఆయన బి టౌన్‌లో అడుగుపెట్టనున్నాడు. ఇందులో అక్కినేని కోడలు సమంత అక్కినేని హీరోయిన్‌గా న

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. అదీకూడా ఓ క్రికెట్ లెజెండ్ బయోపిక్‌తో ఆయన బి టౌన్‌లో అడుగుపెట్టనున్నాడు. ఇందులో అక్కినేని కోడలు సమంత అక్కినేని హీరోయిన్‌గా నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
 
'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అనే చిత్రం తర్వాత బన్నీ సుదీర్ఘ గ్యాప్ తీసుకున్నాడు. ఇపుడు విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న త‌దుప‌రి సినిమా చేయ‌నున్నాడ‌నే వార్త వినిపిస్తోంది. ఇందులోనే స‌మంత క‌థానాయిక‌గా న‌టిస్తుంద‌ని అంటున్నారు. 
 
అదేసమయంలో బ‌న్నీ బాలీవుడ్ ఎంట్రీపై దృష్టిసారించాడు. ఆయన బీటౌన్ డెబ్యూ లెజండ‌రీ క్రికెట‌ర్ క‌పిల్ దేవ్ బ‌యోపిక్‌తో ఉంటుంద‌ని చెబుతున్నారు. 1983 వరల్డ్‌కప్ ఫైనల్లో అప్పటి డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించి తొలిసారి టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 
 
ఆ టీమ్ సక్సెస్ స్టోరీ ఆధారంగా మూవీ తెరకెక్క‌నుంది. ఇందులో క‌పిల్ దేవ్ పాత్ర‌ని ర‌ణ‌వీర్ సింగ్ పోషిస్తుండ‌గా, ఇండియ‌న్ క్రికెట‌ర్ కృష్ణ‌మాచారి శ్రీకాంత్ పాత్ర‌లో బ‌న్నీ న‌టిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. చిత్ర ద‌ర్శ‌కుడు క‌బీర్ ఖాన్... బ‌న్నీ పాత్ర‌ని చాలా స్టైలిష్‌గా డిజైన్ చేయ‌డంతో ఆ సినిమాలో న‌టించేందుకు బ‌న్నీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. 
 
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల‌కి మార్కెట్ వాల్యూ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తెలుగు, మ‌ల‌యాళ భాష‌ల‌లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న బ‌న్నీకి త‌మిళంలోనూ ఆద‌ర‌ణ బాగానే ఉంది. ఇక బ‌న్నీ టార్గెట్ బాలీవుడ్ అని చెబుతుండ‌గా, త్వ‌ర‌లోనే అది జ‌ర‌గ‌నుంద‌ని ఫిలింన‌గ‌ర్‌లో చ‌ర్చించుకుంటున్నారు. తన మార్కెట్ వాల్యూను క్యాష్ చేసుకునే విధంగానే ఈ ఫిల్మ్ మేకింగ్ ఉంటుందని బన్నీ సన్నిహితులు చెపుతున్నారు.