మీడియాలో వస్తున్న వార్తలన్నీ ఆవు పేడతో సమానం- కోచ్ రవిశాస్త్రి

టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి, బాలీవుడ్‌ నటి నిమ్రత్‌ కౌర్‌ల మధ్య ప్రేమ చిగురించిందని, రెండేళ్ల పాటు వీరిద్దరూ డేటింగ్‌లో వున్నారని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. త్వరలో తమ ప్రేమ విషయాన్ని బహిర్గతం చేయ

Ravisastri
selvi| Last Updated: మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (12:14 IST)
టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి, బాలీవుడ్‌ నటి నిమ్రత్‌ కౌర్‌ల మధ్య ప్రేమ చిగురించిందని, రెండేళ్ల పాటు వీరిద్దరూ డేటింగ్‌లో వున్నారని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. త్వరలో తమ ప్రేమ విషయాన్ని బహిర్గతం చేయనున్నారని జాతీయ మీడియా కోడైకూసింది. ఈ వార్తలపై ఇప్పటికే సినీ నటి నిమ్రత్ కౌర్ ఫైర్ అయ్యింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టి పారేసింది. 
 
 
 
అంతేగాకుండా.. రవిశాస్త్రితో ప్రేమాయణం గురించి వార్తలు తనను ఎంతో బాధించాయని నిమ్రత్ కౌర్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మీడియాలో తనకు, నిమ్రత్‌కు లింకుందనే వస్తున్న వార్తలపై రవిశాస్త్రి మండిపడ్డారు. ఆ వార్తలన్నీ ఆవు పేడతో సమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఒంటరిగానే ఉన్నానని.. ప్రేమ కోసం వెంపర్లాడడం లేదని తేల్చి చెప్పేశారు. 
 
నిమ్రత్‌ ప్రస్తుతం ఆల్ట్‌ బాలాజీ సంస్థ నిర్మిస్తున్న ది టెస్ట్‌ కేస్ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. రవిశాస్త్రి ఇంగ్లండ్‌లో జరుగుతున్న సిరీస్‌తో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరికీ లింకు పెడుతూ వస్తున్న వార్తలపై రవిశాస్త్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 
 
మూడేళ్ల క్రితం ఓ జర్మనీ కంపెనీ తనను, నిమ్రత్‌ను వారి కార్ల ప్రచారం నిమిత్తం ఎంచుకుందని, ఆ సమయంలోనే తామిద్దరికీ పరిచయం ఏర్పడిందని చెప్పిన రవిశాస్త్రి, తాము కలసి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నామని అంతకు మించి మరేమీ లేదని క్లారిటీ ఇచ్చేశారు.దీనిపై మరింత చదవండి :