బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: మంగళవారం, 28 ఆగస్టు 2018 (21:00 IST)

ఆవు పేడ... ఆవు నెయ్యి... ఆవు పాలు... వీటిలో ఏమున్నాయో తెలుసా?

గోవు గురించి తెలియనివారు ఉండరు. ఎందుకంటే దీనివలన కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కవ. గోవును హిందువులు ఆరాధ్య దైవంగా భావిస్తారు. గోవు నుంచి వచ్చే మూత్రం సేవించడం వలన కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆవు పాలకు విషాన్ని హరించే గు

గోవు గురించి తెలియనివారు ఉండరు. ఎందుకంటే దీనివలన కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కవ. గోవును హిందువులు ఆరాధ్య దైవంగా భావిస్తారు. గోవు నుంచి వచ్చే మూత్రం సేవించడం వలన కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆవు పాలకు విషాన్ని హరించే గుణం ఉంది. గోవు వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. ఆవు పేడలో కలరా వ్యాధిని వ్యాపింపచేసే క్రిములను నాశనం చేసే శక్తి ఉంది. ఆవు నెయ్యి మేధస్సును వృద్ధి చేస్తుంది.
 
2. ఆవు నెయ్యితో హోమం చేయడం వలన వాతావరణంలో ఉన్న క్రిములు చనిపోతాయి. పర్యావరణ పరిరక్షణలో గోవుపాత్ర ఎంతో ఉంది.
 
3. గోవుని ప్రతి నిత్యం పూజించటం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. గోవు వృష్ట భాగంలో బ్రహ్మ, మెడలో విష్ణువు ముఖాన శివుడు, రోమరోమాన మహర్షులు, దేవతలు నివశిస్తారు.
 
4. అంతేకాక ఆవుపేడలో అష్టలక్ష్ములు కొలువుంటాయి. ఆవు పాలు తల్లి పాల కన్నా శ్రేష్టమైనవి. ఇవి పలచగా ఉండి కొవ్వు తక్కువుగా ఉండటం వలన శరీర బరువుని నియంత్రిస్తాయి.
 
5. ఉదర సంబంధమైన జబ్బులను తగ్గించడంలో ఈ పాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఆవు పాలలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా దీనిలో కెఫిన్ అనే ఎంజైము ఉండటం వలన పాలు పసుపు రంగులో ఉంటాయి. ఈ ఆవు పాలను ప్రతి రోజు తాగడం వలన వృద్ధాప్య ఛాయలు దరిచేరవు.